https://oktelugu.com/

కరోనా నుంచి కోలుకున్న వారికి మరో షాకింగ్ న్యూస్.. ?

సాధారణంగా ఏ వ్యాధి బారిన పడినా మందులు వాడిన తరువాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటాం. కానీ కరోనా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలల తరువాత కూడా చాలామందిని ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వైద్య నిపుణులు కరోనా నుంచి కోలుకున్న వాళ్ల కంటి రక్తనాళాల్లో సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..! కరోనా మహమ్మారి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2020 / 02:45 PM IST
    Follow us on


    సాధారణంగా ఏ వ్యాధి బారిన పడినా మందులు వాడిన తరువాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటాం. కానీ కరోనా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలల తరువాత కూడా చాలామందిని ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వైద్య నిపుణులు కరోనా నుంచి కోలుకున్న వాళ్ల కంటి రక్తనాళాల్లో సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.

    Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

    కరోనా మహమ్మారి సోకి వైరస్ నుంచి కోలుకున్న వారిలో కంటిచూపు మందగించిందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సైతం కరోనా విజృంభణ నేపథ్యంలో అత్యవసర కేసులను నేరుగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్య నిపుణులు కంటి నరంలో ఏర్పడే సమస్యల వల్ల చూపు మసకబారుతుందని చెబుతున్నారు. స్టెరాయిడ్స్ వాడి కోలుకున్న వాళ్లు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారని సమాచారం.

    Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారికి షాకింగ్ న్యూస్..?

    ఎవరైనా కరోనా వైరస్ నుంచి కోలుకుని కంటి సంబంధిత సమస్యలు ఎదురైతే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. తీవ్రమైన కంటి నొప్పి, కనురెప్పలకు గాయాలు, కంటికి దెబ్బ తగలడం, వైరల్‌ రెటినిటిస్, ఇతర కంటి సంబంధిత సమస్యలకు వేగంగా వైద్యం అందించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కంటి నరాల్లో రక్త ప్రవాహం తగ్గడం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నట్టు సమాచారం.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    అన్ని ఇంద్రియాలలో కళ్లు అతి ముఖ్యమైనవి. కళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జీవితాంతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కంటికి సంబంధించి పెద్ద సమస్యలు లేకపోతే టెలీ కన్సల్టేషన్ మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు.