https://oktelugu.com/

Shobha Shetty: ప్రియుడికి తెలియకుండా ఆ కంటెస్టెంట్ తో శోభ శెట్టి ఎఫైర్… తెలిసి పెళ్లి క్యాన్సిల్!

శోభా శెట్టి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. ఒక వీడియో రూపంలో తన బాధను మొత్తం బయట పెట్టింది. ఈ వీడియోలో శోభా తేజ కి కాల్ చేసింది. ఏడుస్తూ నీవల్లే మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి అని చెప్పింది.

Written By:
  • S Reddy
  • , Updated On : January 31, 2024 / 01:50 PM IST
    Follow us on

    Shobha Shetty: బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి హౌస్ లో ఉన్నప్పుడు తన ప్రేమ విషయం అందరి ముందు బయట పెట్టి షాక్ ఇచ్చింది. ఇక బయటకు వచ్చాక ప్రియుడు యశ్వంత్ రెడ్డితో చక్కర్లు కొడుతూ తెగ సందడి చేసింది. ఇటీవల యశ్వంత్ రెడ్డి తో ఎంగేజ్మెంట్ కూడా జరుపుకుంది. పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. శోభ సొంతూరు బెంగళూరులో బంధువుల సమక్షంలోఈ వేడుక జరిగింది. అనూహ్యంగా ఈ జంట మధ్య గొడవలు మొదలైనట్లు తెలుస్తుంది. పెళ్లి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందట. వారి గొడవకు కారణం టేస్టీ తేజ అంటూ శోభా బాంబు పేల్చింది.

    ఈ విషయం శోభా శెట్టి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. ఒక వీడియో రూపంలో తన బాధను మొత్తం బయట పెట్టింది. ఈ వీడియోలో శోభా తేజ కి కాల్ చేసింది. ఏడుస్తూ నీవల్లే మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి అని చెప్పింది. ఇక మేమిద్దరం కలిసి ఉండలేకపోతున్నాం అంటూ శోభా చెప్పింది. నీతో క్లోజ్ గా ఉండటంతో .. నువ్వు నా గురించి బయట తప్పుగా మాట్లాడుతున్నావ్ అంట అని శోభా చెప్పింది. తేజ దెబ్బకు షాక్ అయ్యాడు.

    అదేం లేదు .. నేను నీ గురించి తప్పుగా మాట్లాడలేదు .. నీకు అసలు ఎవరు చెప్పారు అంటూ తేజ బాధ పడ్డాడు. ఇక శోభా ఓవర్ యాక్షన్ చేస్తూ నీ వల్లే ఇదంతా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో తేజ నేను ఎలాంటి వాడినో యశ్వంత్ కి తెలుసు, నా కంటే కూడా నీవు ఎలాంటి దానివో అతనికి బాగా తెలుసు. అతను చాలా మంచి వాడు .. ఇలా మన గురించి తప్పుగా ఆలోచించడు అంటూ తేజ నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు. మన ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటే నమ్మే వ్యక్తి కాదు అంటూ తేజ చెప్పుకొచ్చాడు.

    కానీ శోభా మాత్రం ఆపలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా అంటూ ఫైర్ అయింది. చాలా రోజులుగా నేను నీవల్ల బాధపడుతున్నాను అందుకే ఫోన్ కూడా చేయట్లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక చివరికి ఇదంతా ప్రాంక్ అంటూ తేజ అసలు విషయం రివీల్ చేసింది. దీంతో తేజ ఊపిరి పీల్చుకున్నాడు. కేవలం ఫన్ కోసమే ఇదంతా చేసినట్లు శోభా వివరించింది. అయితే వ్యూస్ కోసం పనికి మాలిన ఫ్రాంక్స్ చేస్తున్న వీరిపై ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నాడు. తేజాకు తన ఇంట్లో గుండెపోటు వచ్చినట్లు ప్రియాంక ఓ వీడియో చేసి వదిలిన సంగతి తెలిసిందే…