https://oktelugu.com/

Shraddha Das: శ్రద్దాదాస్ ను ఆ హీరోయిన్ కోమాలోకి వెళ్ళే దాక కొట్టిందా?

ఢీ డాన్స్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది ఈ బ్యూటీ. వెండితెర మీద నటిస్తున్నప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించింది. కానీ అందులో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 1, 2024 4:18 pm
    Shraddha Das

    Shraddha Das

    Follow us on

    Shraddha Das: శ్రద్ధ దాస్.. హీరోయిన్ గా నటించకపోయినా ఈ అమ్మడు గురించి పరిచయం అవసరం లేదు. సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ పేజి ను సంపాదించుకుంది. ఎన్నో సినిమాల్లో నటించిన శ్రద్ధ.. సెకండ్ హీరోయిన్ గా మాత్రమే నటించింది కానీ.. ఇప్పటికీ మెయిన్ హీరోయిన్ గా నటించలేకపోయింది. కానీ ఈ మధ్య సినిమా ఇండస్ట్రీకే దూరం అయినట్టు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏ సినిమాలో కూడా కనిపించలేదు అమ్మడు. కానీ బుల్లితెర మీద సందడి చేస్తోంది.

    ఢీ డాన్స్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది ఈ బ్యూటీ. వెండితెర మీద నటిస్తున్నప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించింది. కానీ అందులో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఆ సినిమా గురించి మాట్లాడుతూ శ్రద్దా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో ఈమె నటించిన సినిమా జిద్. ఇందులో ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రా విలన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈమె హిందీ బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాప్ 5లో ఒకరిగా నిలిచారు.

    ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్ మన్నారా చోప్రా గురించి పలు వ్యాఖ్యలు చేసింది. జిద్ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక సన్నివేశంలో తనను మెట్ల పై నుంచి తోసే సన్నివేశం ఉంటుందట. అప్పటికే డైరెక్టర్ మెల్లగా తోయాలి అని చెప్పారట. కానీ మన్నారా మాత్రం తనను బలంగా తోసేసిందట. దీంతో ఆమెకు తీవ్రమైన గాయాలు అయ్యాయని బాధ పడింది శ్రద్ధ. అదే విధంగా మరొక సన్నివేశంలో మన్నార ఛాతిపై కొట్టాల్సిన సన్నివేశం కూడా ఉందట. అప్పుడు కూడా ఎక్కువగా రియాక్ట్ అయిందట మన్నారా.

    ఈ సన్నివేశానికి ముందు కూడా శ్రద్దా మన్నారా తో మెల్లగా కొట్టండి అని చెప్పిందట. కానీ ఆమె నిజమైన కర్ర తీసుకొని బలం మొత్తం ఉపయోగించి చితకబాదిందని తెలిపింది శ్రద్దాదాస్. ఆ దెబ్బలకు తను హాస్పిటల్ పాలైందట. ఇంకా కొంచెం గట్టిగా కొట్టి ఉంటే కోమాలోకి వెళ్లిపోయేదని చెప్పారట డాక్టర్లు. ఇక ఈ విషయాలను తెలియజేస్తూ బాధ పడింది శ్రద్ధా.