Shivani Rajashekar: యాక్టింగ్ వద్దని డాక్టర్ కోర్సు చేస్తున్న హీరోయిన్..

తెలుగుసినిమాల్లో 90 లోని అగ్రహీరోల్లో రాజశేఖర్ ఒకరు. ‘అంకుశం’ సినిమా ద్వారా స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ఆయన కెరీర్ లో ఎన్నో బెస్ట్ ఫిలింస్ చేశాడు. కొన్ని సినిమాలు రాజశేఖర్ మాత్రమే చేయగలడు అన్నంతలా నటించాడు.

Written By: Chai Muchhata, Updated On : March 15, 2024 6:46 pm

Shivani Rajashekar

Follow us on

Shivani Rajashekar: సినిమాల్లో నటించాలని చాలా మందికి ఉంటుంది. కానీ సరైన అవకాశాలను కొందరే తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ వారసులను పరిచయం చేశారు. కానీ వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. తెలుగు సినిమాల్లో ఓ హీరో, హీరోయిన్ కలిసి నటించి.. ఆ తరువాత జీవితంలో ఒక్కటయ్యారు. వారి వారసులుగా కూతుళ్లను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. వీరిలో ఒకరు ఎంట్రీ ఇచ్చినా స్టార్ కాలేకపోతున్నారు. ఎవరా స్టార్లు? వారి వారసురాలు ఎవరు?

తెలుగుసినిమాల్లో 90 లోని అగ్రహీరోల్లో రాజశేఖర్ ఒకరు. ‘అంకుశం’ సినిమా ద్వారా స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ఆయన కెరీర్ లో ఎన్నో బెస్ట్ ఫిలింస్ చేశాడు. కొన్ని సినిమాలు రాజశేఖర్ మాత్రమే చేయగలడు అన్నంతలా నటించాడు. ఆయనతో కలిసి నటించిన జీవిత ఆ తరువాత రాజశేఖర్ కు జీవిత భాగస్వామిగా మారిపోయింది. మొన్నటి వరకు రాజశేఖర్ పలు సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తరువాత ఆయన వారసురాలిగా కూతురు శివాని’ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

‘దొరసాని’ అనే సినిమాతో శివాని తెలుగు ఇండస్ట్రీలో పరిచయం చేసింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో అమెకు గుర్తింపు రాలేదు. కానీ ఆ తరువాత ‘అద్భుతం’లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కరోనా సమయంలో ముందుగా ఓటీటీల రిలీజ్ చేశారు. అక్కడ సక్సెస్ అయ్యాక థియేటర్లోకి తీసుకొచ్చారు. దీంతో శివానిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ తరువాత ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో శివాని సినిమాల్లో ట్రై చేయడం మానేసి చదువుపై దృష్టి పెట్టింది.

శివాని డాక్టర్ కోర్సు కోసం ప్రాక్టికల్స్ చేయనుందట. దీంతో ప్రస్తుతం సినిమాల్లో నటించనని తెలిపింది. అయితే చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతారు. కానీ శివాని మాత్రం యాక్టింగ్ వద్దని డాక్టర్ కోర్సుపై దృష్టి పెడుతోంది. వాస్తవానికి తనకు సినిమాల్లో కంటే డాక్టర్ అయి సేవలు చేయడమంటేనే ఇష్టమని చెబుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది మంచి నిర్ణయం అని ఆమెను పొగుడుతున్నారు.