Plants: ఇంట్లో అస్సలు పెంచకూడని చెట్లు ఇవీ.. పెంచితే అరిష్టమే

కాక్టస్ అనేది ముళ్ల మొక్క. దీనికి ఉండే ముళ్ల వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుందని చెబుతున్నారు వాస్తు జ్యోతిష్యులు. ఈ మొక్క ఇంట్లో ఉంటే కుటుంబంలో ఒత్తిడి, ఆందోళన, గొడవలు, గందరగోళంగా ఉంటుంది. ఈ మొక్కను పడకగదిలో, ప్రధాన ప్రవేశంలో అసలు ఉంచకూడదట.

Written By: Swathi, Updated On : March 15, 2024 6:53 pm

Plants

Follow us on

Plants: మొక్కలను ఇష్టపడని వారు ఎవరుంటారు. గ్రీనరీతో కూడిన ఈ మొక్కలు చాలా ప్రశాంత వాతారణాన్ని అందిస్తాయి. కాస్త గ్రీనరీ ఉన్న మొక్కల దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని ఒక చిన్న టీ తాగితే చాలు సూపర్ గా అనిపిస్తుంది. మరి కొన్ని మొక్కలు మాత్రం ఇంటి ముందు పెంచుకోవడానికి అసలు మంచిది కాదట. ప్రశాంతత కాదు దురదృష్టం ఇంట్లో తాండవం చేస్తుందట. మరి ఆ మొక్కలు ఏంటో తెలుసా..?

కాక్టస్.. కాక్టస్ అనేది ముళ్ల మొక్క. దీనికి ఉండే ముళ్ల వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుందని చెబుతున్నారు వాస్తు జ్యోతిష్యులు. ఈ మొక్క ఇంట్లో ఉంటే కుటుంబంలో ఒత్తిడి, ఆందోళన, గొడవలు, గందరగోళంగా ఉంటుంది. ఈ మొక్కను పడకగదిలో, ప్రధాన ప్రవేశంలో అసలు ఉంచకూడదట.

పత్తి.. అలంకరణ, పూజ కోసం చాలా మంది ఇంట్లో పత్తి చెట్లను పెంచుతారు. కానీ ఈ మొక్కలను పెంచడం మంచిది కాదని చెబుతుంది వాస్తు శాస్త్రం. దురదృష్టాన్ని తెస్తుంది ఈ పత్తి మొక్క. దీని వల్ల అశాంతి, అలజడి ఉంటుంది. అంతేకాదు కుటుంబ సభ్యుల మద్య సత్సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందట.

గోరింటాకు.. గోరింటాకు కూడా ఇంటికి మంచిది కాదు. ఇది ఇంట్లో, ఇంటి ఆవరణలో ఉంటే దరిద్రమే అంటున్నారు వాస్తు నిపుణులు. దీని వల్ల ప్రతికూల ఆలోచనలతో కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఖర్జూరం.. ఖర్జూరం వల్ల ఆరోగ్యానికి మంచిది. పోషకాలు మెండుగా ఉంటాయి ఈ పండ్లు తినడానికి మంచిది కానీ చెట్టును పెంచడం మాత్రం మంచిది కాదట. వీటిని ఇంట్లో ఇంటి ముందు పెంచడం వల్ల కుటుంబంలో గొడవలు తలెత్తుతాయట. ఆర్థికంగా నష్టాలు కూడా వస్తాయి.

చింత చెట్టు.. చింత చెట్టు కూడా ఇంటి వాతావరణంలో ఉండకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒకవేళ మీ ఇంట్లో చింత చెట్టు ఉంటే తొలగించడం బెటర్.