Shiva Balaji: కొడుకు పుట్టాక భార్యకు విడాకులు ఇచ్చేద్దామనుకున్నా… శివ బాలాజీ షాకింగ్ కామెంట్స్

ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయట. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట వ్యక్తిగత విషయాలు ఆడియన్స్ తో పంచుకున్నారు. మధుమిత మాట్లాడుతూ... జాతకాలు కుదరలేదని శివ బాలాజీ తల్లి పెళ్లి ఆపేశారు.

Written By: Shiva, Updated On : May 20, 2023 8:47 am

Shiva Balaji

Follow us on

Shiva Balaji: నటుడు శివ బాలాజీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. హీరోగా వెండితెరకు పరిచయమైన శివ బాలాజీ ఆర్య మూవీతో ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే చందమామ మూవీలో మరో హీరోగా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. అయితే శివ బాలాజీ హీరోగా సక్సెస్ కాలేదు. సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరో పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చింది. శివ బాలాజీ నటి మధుమితను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. మధు మిత చాలా చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు.

ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయట. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట వ్యక్తిగత విషయాలు ఆడియన్స్ తో పంచుకున్నారు. మధుమిత మాట్లాడుతూ… జాతకాలు కుదరలేదని శివ బాలాజీ తల్లి పెళ్లి ఆపేశారు. దాంతో నేను తీవ్ర డిప్రెషన్ కి గురయ్యాను. మరలా రెండేళ్ల తర్వాత మా పెళ్లి జరిగింది, అన్నారు. ఇక శివ బాలాజీ మాట్లాడుతూ… లవ్ లో ఉన్నప్పుడు మేమిద్దరం దూరంగా ఉండేవాళ్ళం. దాని వలన ఒకరిపై మరొకరికి చాలా ప్రేమ ఉండేది.

పెళ్లయ్యాక ఇద్దరం కలిసి ఉండటం వలనేమో కానీ అఫెక్షన్ తగ్గింది. మనస్పర్థలు తలెత్తాయి. ఒక అబ్బాయి పుట్టాక విడాకులు తీసుకోవాలి అనుకున్నాము. అప్పుడు మా కజిన్ కొద్ది రోజులు దూరంగా ఉండమని సలహా ఇచ్చింది. దూరంగా ఉన్న ఈ కొద్ది రోజుల్లో ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టమో తెలిసొచ్చింది. అప్పుడు మనస్పర్థలు తొలగి మా బంధం బలపడిందని, అన్నారు.

శివ బాలాజీ తండ్రి మరణించాకా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆస్తులు అమ్మి ఆ అప్పులు తీర్చారట. కాగా శివ బాలాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విన్నర్. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్లో శివ బాలాజీ పాల్గొన్నాడు. టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్న ఆ షోలో విన్నర్ గా నిలిచాడు. ఈ మధ్య ఆయనకు ఆఫర్స్ తగ్గాయి. వెబ్ సిరీస్లు, అడపదడపా చిత్రాలు చేస్తున్నారు.