NTR First Remuneration: నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, పసిప్రాయంలోనే ఎన్టీఆర్ తన టాలెంట్ చూపించారు. బాల రామాయణం మూవీలో రాముడిగా మెప్పించారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన బాల రామాయణం చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. 17 ఏళ్లకే ఎన్టీఆర్ హీరోగా మారాడు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో నిన్ను చూడాలని టైటిల్ తో ఎన్టీఆర్ హీరోగా మూవీ తెరకెక్కింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన నిన్ను చూడాలని 2001 మే 25న విడుదలైంది. ఈ చిత్ర విడుదల నాటికి ఎన్టీఆర్ వయసు 18 ఏళ్ళు.
నిన్ను చూడాలని సినిమా ఆడలేదు. అయితే ఈ చిత్రానికి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ గా రూ. 4 లక్షలు తీసుకున్నాడట. టీనేజ్ కూడా దాటని ఎన్టీఆర్ కి అంత డబ్బు ఏం చేయాలో అర్థం కాలేదట. నాలుగు లక్షల రూపాయలు అమ్మ చేతికి ఇచ్చాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రెండో మూవీతో ఎన్టీఆర్ హిట్ కొట్టారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అయ్యింది.
ఆది సినిమా ఎన్టీఆర్ కి ఇమేజ్ తెచ్చిపెట్టింది. తక్కువ ప్రాయంలోనే ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదిగాడు. స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఎన్టీఆర్ డాన్సులు, నటన తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆస్కార్ వేడుకలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నారు. బాలీవుడ్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు వెనుకబడుతుంది. క్రేజీ ప్రాజెక్ట్ వార్ 2లో ఎన్టీఆర్ భాగమయ్యారు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ గా ఇది తెరకెక్కనుంది.
హీరోగా చేసిన ఫస్ట్ మూవీకి ఎన్టీఆర్ కేవలం నాలుగు లక్షలు తీసుకున్నారు. కానీ ఆయన ప్రజెంట్ రెమ్యూనరేషన్ దాదాపు రూ. 100 కోట్లు. వార్ 2 చిత్రానికి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ వంద కోట్లని తెలుస్తుంది. దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న దేవర చిత్ర బడ్జెట్ రూ. 300 కోట్లు. ఎన్టీఆర్ ఈ చిత్రానికి రూ. 80 కోట్లు తీసుకుంటున్నారట. ఎన్టీఆర్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చారు.