https://oktelugu.com/

Hindi Chhatrapati Collections:100 కోట్ల బడ్జెట్ తో తీసిన హిందీ ‘ఛత్రపతి’ వారం రోజుల్లో రాబట్టిన వసూళ్లు ఎంతో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు

రీమేక్ కి బాలీవుడ్ ఆడియన్స్ నుండి పూర్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 40 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అలా వారం రోజులకు కలిపి ఈ సినిమా అక్కడ 92 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిందట. హిందీ లో డిస్ట్రిబ్యూషన్ రంగం ఉండదు, డైరెక్ట్ గా నిర్మాతలే సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు.

Written By: , Updated On : May 20, 2023 / 08:10 AM IST
Hindi Chhatrapati Collections

Hindi Chhatrapati Collections

Follow us on

Hindi Chhatrapati Collections: ఓటీటీ కాలం లో రీమేక్ సినిమాలను చూడడం జనాలు బాగా తగ్గించేశారు.పవన్ కళ్యాణ్ స్థాయి భారీ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల సినిమాలు తప్ప, మిగిలిన వాళ్ళవి అస్సలు చూడడం లేదు.టాక్ బాగా వచిన్నప్పటికీ కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోతున్నాయి. ఎక్కువగా ఇది బాలీవుడ్ లోనే జరుగుతూ వస్తుంది. బడా సూపర్ స్టార్స్ రీమేక్ సినిమాలు సైతం బోల్తా కొట్టేస్తున్నాయి.

అలాంటిది యూట్యూబ్ లో హిందీ లో డబ్ అయ్యి ఉన్న ఒక తెలుగు సినిమాకి వందల మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి, టీవీ టెలికాస్ట్ లో కూడా రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి, అలాంటి సినిమాని ఎవ్వరైనా వంద కోట్ల రూపాయిల బడ్జెట్ ఖర్చు చేసి తీసే సాహసం చేస్తారా.కానీ మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేసాడు. హిందీ లో ఆయన బెల్లం కొండా సాయి శ్రీనివాస్ తో ‘ఛత్రపతి’ చిత్రాన్ని రీమేక్ చేసి గత వారం లో విడుదల చేసారు.

ఈ రీమేక్ కి బాలీవుడ్ ఆడియన్స్ నుండి పూర్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 40 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అలా వారం రోజులకు కలిపి ఈ సినిమా అక్కడ 92 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిందట. హిందీ లో డిస్ట్రిబ్యూషన్ రంగం ఉండదు, డైరెక్ట్ గా నిర్మాతలే సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు.ఈ చిత్రాన్ని కూడా అలాగే విడుదల చేసారు.

కానీ ఇలాంటి రెస్పాన్స్ ని అసలు ఊహించలేకపోయాడట వీవీ వినాయక్.లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అయ్యుంటే ఆయనకీ రీమేక్ సినిమాల ప్రభావం ఎంత ఉందో అర్థం అయ్యేదని, వీవీ వినాయక్ ఆ విషయం లో బాగ్ వెనుకబడ్డాడని అంటున్నారు విశ్లేషకులు.టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన వీవీ వినాయక్ పరిస్థితి చివరికి ఇలా అయ్యిందే అని ఆయన ఫ్యాన్స్ తెగ బాదపడిపోతున్నారు.