https://oktelugu.com/

శిల్పాశెట్టి భర్తకు ఏమైంది? పోర్న్ లోకి ఎందుకెళ్లాడు?

ప్రముఖ సినీనటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ముంబైలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారనే అనుమానంతో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. రాజ్ కుంద్రా పై ఆరోపణలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోర్న్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసు నమోదైనట్లు పోలీులు వెల్లడించారు. ఇందులో రాజ్ కుంద్రా పాత్ర కీలకంగా మారిందని నిర్ధారించారు. ముంబై క్రైమ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 20, 2021 / 10:25 AM IST
    Follow us on

    ప్రముఖ సినీనటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ముంబైలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారనే అనుమానంతో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. రాజ్ కుంద్రా పై ఆరోపణలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోర్న్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసు నమోదైనట్లు పోలీులు వెల్లడించారు. ఇందులో రాజ్ కుంద్రా పాత్ర కీలకంగా మారిందని నిర్ధారించారు.

    ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఫిబ్రవరి 2021లో పోర్న్ చిత్రాలకు సంబంధించి కేసు నమోదైంది. పోర్న్ చిత్రాల నిర్మాణం పలు యాప్స్ లో వాటిని అప్ లోడ్ చేసిన కారణంగా ఈ కేసు నమోదు ేశారు. అందులో రాజ్ కుంద్రా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు. మరోవైపు రాజ్ కుంద్రా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. పోర్న్ చిత్రాలు నిర్మించినట్లుగా చెబుతున్న సంస్థతో తాను గతంలోనే తెగదెంపులు చేసుకున్నానని చెబుతున్నారు.

    గతంలో ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2013 సీజన్ లో బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ లో రాజ్ కుంద్రాపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐపీఎల్ లో పాల్గొనకుండా ఆయనపై నిషేధం కూడా పడింది. 2018లో బిట్ కాయిన్ కుంభకోణంలోనూ రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈడీ ఆయన్ను విచారించింది. తాజాగా పోర్న్ చిత్రాల కేసులో ఇరుక్కోవడంతో రాజ్ కుంద్రా పరువు పోయినట్లయింది.

    ఇదే కేసుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బాలీవుడ్ నటి గెహానా వశిష్టను పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలను చిత్రీకరిస్తూ వాటిని వెబ్ ప్లాట్ ఫామ్స్ లో అప్ లోడ్ చేస్తోందన్న ఆరోపణల మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. గెహానాతో పాటు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా రోయా ఖఆన్ అలియాస్ యాస్మీన్ ను గుర్తించారు. ముంబై కేంద్రంగా ఓ గ్యాంగ్ పోర్న్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు స్తానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు దీన్ని చేధించే పనిలో నిమగ్నమయ్యారు.