వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి వార్తల్లోకెక్కారు. గత కొన్ని నెలల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. అక్కడి నుంచే తన కార్యకలపాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆ వార్తలపై స్పందించారు. తనపై ఎవరో బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అవన్నీ అవాస్తవమని ఎంపీ అన్నారు.
వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు గతేడాది నుంచి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నారు. అయితే ఆయన ప్రభుత్వంపై ధూషణలు చేశారని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత రఘురామ కృష్ణం రాజు తనపై ఎంపీ అని చూడకుండా థర్డ్ ఢిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నుంచి వచ్చి ఆదేశాల ప్రకారం ఆయన సికింద్రాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొంది అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.
అప్పటి నుంచి ఎంపీ అక్కడి నుంచే తన వ్యవహారాలను నడిపిస్తున్నారు. తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష కడుతుందంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. ఇక వైపీపీ పార్లమెంట్ నేత విజయసాయిరెడ్డి తనపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారని, ఆయనను కలిసి అన్ని విషయాలు వెల్లడిస్తారనన్నారు. తాను పార్టీ ఉల్లంఘనలు ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. అలాగే తన లోక్ సభ సభ్యత్వం రద్దు కావడం కూడా అబ్ధమేనన్నారు.
ఇదిలా ఉండగా తన సహచర ఎంపీలు కొందరు పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించడం లేదన్నారు. తమను ఎవరో భయపెట్టినట్లు ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇక తాను మీడియాకు డబ్బులు చెల్లిస్తున్నానని కొందరు పనిలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనకు అలాంటి అలవాటు అస్సలు లేదని చెప్పారు. లోక్ సభ సభ్యత్వానికి నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఎంపీ రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు.