Bigg Boss Telugu 8 : తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ నెలకొంది. టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ మొదలైంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా లాంచ్ చేశారు. కేవలం 14 మంది సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా హౌస్లోకి వెళ్లారు. పెద్దగా పేరున్న నటులు, బుల్లితెర స్టార్స్ లేరు. దాంతో ఒకింత ప్రేక్షకులు నిరాశ చెందారు. ఈ క్రమంలో భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేశారు. అది కూడా గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి మరోసారి ఛాన్స్ ఇచ్చారు.
ఐదు వారాల అనంతరం టేస్టీ తేజ, అవినాష్, గంగవ్వ, హరితేజ, గౌతమ్, రోహిణి, నయని పావని, మెహబూబ్.. మొత్తం 8 మంది మాజీ కంటెస్టెంట్స్ బరిలో దిగారు. వీరిలో ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. అవినాష్, రోహిణి, గౌతమ్ మాత్రమే మిగిలారు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. ఇక ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్న వారిలో ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, నబీల్ పోటీలో నిలిచారు.
అవినాష్ కాకుండా అందరూ నామినషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. మిగిలినవారు ఫైనల్ కి వెళతారు. కాగా బిగ్ బాస్ హౌస్లోకి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన రాకతో కంటెస్టెంట్స్ షాక్ గురయ్యారు. అదే సమయంలో సంతోషం వ్యక్తం చేశారు. కంటెస్టెంట్స్ తో శేఖర్ మాస్టర్ సరదా గేమ్స్ ఆడించారు. శేఖర్ మాస్టర్ ఎంట్రీతో హౌస్ సందడిగా మారింది. టీఆర్పీ కోసం మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తారు.
కాగా టైటిల్ రేసులో నిఖిల్, గౌతమ్ ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది. నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి ఉన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్. అనేక గేమ్స్ లో సత్తా చాటాడు. అదే సమయంలో గౌతమ్ నుండి నిఖిల్ కి గట్టి పోటీ ఎదురవుతుంది. గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీ కావడం మైనస్. అయితే… నిఖిల్ కంటే గౌతమ్ కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయట. చూడాలి.. ఇక ఏమవుతుందో…