https://oktelugu.com/

Goa Trip : గోవా ట్రిప్ ప్లాన్ చేశారా? ఇది మీకోసమే..

నవంబర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య గోవాకు వెళ్లాలనడానికి సరైన సమయం. అందమైన బీచ్‌లను ఆస్వాదించాలంటే.. ఇక్క‌డి ప్ర‌కృతి దృశ్యాలను చూడాలంటే మీరు గోవాకు వెళ్లాల్సిందే. అక్కడ మంచి వాతావ‌ర‌ణం ఉంటుంది. అయితే, గోవా వెళ్లడానికి ముందు మీరు కొన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అవేంటంటే?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 3, 2024 / 08:30 PM IST

    Planning Tips For Goa Trip

    Follow us on

    Goa Trip : ఈ సమయంలో గోవాకు వెళ్లవచ్చు. దేశీయ-అంతర్జాతీయ సందర్శకులకు ఉత్సాహభరితమైన హాట్‌స్పాట్‌గా ఉన్న ఈ ప్లేస్ నవంబర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య అక్క‌డి ప‌రిస‌రాల‌ను ఎంజ‌య్ చేయవచ్చు. ఇక ఈ స‌మ‌యంలో గోవాలో ప‌ర్యాట‌కుల కోసం ఎన్నో ఈవెంట్లు జరుగుతుంటాయి. 31st అండ్ న్యూ ఇయ‌ర్ వేడుక‌లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అద‌రిపోతాయి. ఈ స‌మ‌యంలో జ‌రిగే ఈవెంట్లు చూస్తే క‌ళ్లు చెదిరిపోతాయి. గోవా ట్రిప్ వెళ్లాలని ఉందా? ఎంత ఖర్చవుతుందో అని భయపడుతున్నారా? అయితే చాలా మంది గోవా వెళ్లాలి అనుకుంటారు కానీ ఖర్చు వల్ల భయంతో ఆగిపోతారు.

    గోవా భారతదేశంలో పర్యాటకులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఆహ్లాదకరమైన సముద్రతీర గాలి, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్సాహభరితమైన సంస్కృతితో గోవా పర్యాటకుల హృతులను కట్టిపడేస్తుంది. అక్కడ కలంగుట్ బీచ్ తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం.ఎంతో సూపర్ గా ఉండే ఈ ప్రాంతాన్ని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. ముఖ్యంగా సాహస యాత్రికులకు చాలా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. పండుగ నెలలైన డిసెంబర్, జనవరిలో గోవాకు ప్లాన్ చేయడం బెస్ట్. రద్దీగా ఉంటుంది. అక్కడ ఉండే అన్నింటిని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు.

    దాదాపు ప్రతి బీచ్‌లోనూ అద్భుతమైన అలంకరణలు, గ్రాండ్ పార్టీలు ఉంటాయి. ట్రావెల్ తో పనిలేకుండా స్కూటీ లేదా బైక్ ను తీసుకోవచ్చు. బైక్, స్కూటీ అద్దె రోజుకి ₹200 నుంచి ₹250 మాత్రమే ఉంటుంది. డిసెంబర్‌లో ₹500 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. హోటల్ గదులు సాధారణంగా రాత్రికి ₹1,000 ఖర్చు ఉంటుంది. పీక్ సీజన్‌లో ₹2,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఖర్చు ఆదా చేయాలంటే ఆఫ్-సీజన్‌లో ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. సాధారణంగా ఉండే హోటళ్లు చాలానే అందుబాటులో ఉంటాయి. పూర్తిగా బుకింగ్ కాకుండా ఒక రాత్రి ఒక వ్యక్తికి రూ. 300 గా ఛార్జ్ చేసే హోటల్స్ కూడా ఉంటాయి. సీజన్ లో వెళ్తే మాత్రం ముందే బుక్ చేసుకోండి.

    మీరు ఎంచుకునే కార్యకలాపాలను బట్టి గోవా ట్రిప్ ఖర్చు మారుతూ ఉంటుంది. ఆఫ్-సీజన్ నెలల్లో ₹10,000 నుంచి ₹30,000 వరకు అవుతుంది. ఈ కాస్ట్ తో మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చూడాల్సిన అన్ని ప్రాంతాలు చూస్తారు. ఇక డిసెంబర్, జనవరి నెలల్లో 3 రాత్రులు, 4 రోజుల ట్రిప్‌కి ₹50,000 నుంచి ₹80,000 వరకు అవుతుంది. ఈ బడ్జెట్‌లో వసతి, రవాణా, భోజనం, కార్యకలాపాలు అవుతాయి. కాబట్టి ఆఫ్ సీజన్ లో కంటే ఈ రద్ది సీజన్ లో ఖర్చు ఎక్కువ అని గుర్తు పెట్టుకోండి. ఈ ట్రిప్ లో మీరు తక్కువ ప్రదేశాలు చూడటం లేదా ఈవెంట్స్ లో తక్కువ పాల్గొనడం చేస్తే మరింత ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. మారియో మిరాండా గ్యాలరీ,టాటో, డోనా పౌలా, గ్రేసియా డీ ఒర్టా, ఆదిల్ షా ప్యాలెస్, కేఫ్ సెంట్రల్, బాగా బీచ్, దూద్ సాగర్ జలపాతం, పలోలెం బీచ్, అగోండా బీచ్, కొలంగెట్ బీచ్ లను చూడకుండా రావద్దు.