Shekhar Kammula Latest News: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ డైరెక్టర్లు చాలామంది తక్కువ మంది ఉన్నారు. కానీ సెన్సిబుల్ దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ముఖ్యంగా శేఖర్ కమ్ముల (Shekar Kammula) లాంటి దర్శకుడు మొదటి సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేర (Kubera) సినిమా వరకు అన్ని సినిమాల్లో కూడా ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించి ఆ సినిమాలను సక్సెస్ చేశారనే చెప్పాలి. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు సైతం శేఖర్ కమ్ముల గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా ఆయన మాట్లాడుతూ శేఖర్ కమ్ముల తను నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రమే సినిమాలుగా చేస్తూ ఉంటాడని ఎక్కడ కూడా వేరేది ఏదో చేయాలనే తాపత్రయం లేదని ఆయన ఎలాంటి సినిమాలు అయితే చేయాలనుకున్నాడో వాటిని మాత్రమే చేసుకుంటూ సక్సెస్ లను సాధిస్తున్నాడు అంటూ శేఖర్ కమ్ముల గురించి రాజమౌళి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం శేఖర్ కమ్ముల కుబేర సినిమాతో 100 కోట్ల మార్కు దాటి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల కెరియర్ మొదట్లో చేసిన ఆనంద్ (Anand), గోదావరి (Godhavari) సినిమాల్లో హీరోయిన్ గా కమలిని ముఖర్జీ (Kamalini Mukarji) ని తీసుకున్నాడు.
అయితే ఈ రెండు సినిమాల్లో తను హీరోయిన్ గా నటించడం వల్ల శేఖర్ కమ్ములకి తనకి మధ్య ఏదో జరుగుతుంది అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో కొన్ని కథలనైతే వచ్చాయి. ఇక శేఖర్ కమ్ముల కమలని ముఖర్జీ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరి కావాలనే కొంతమంది ఇలాంటి గాసిప్స్ ను క్రియేట్ చేసి కొంతమందిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారని మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల ఇప్పుడున్న దర్శకులకు ఏ మాత్రం తీసిపోకుండా తన శైలిలో సినిమాలను చేసుకుంటూ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక మీదట స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి పాన్ ఇండియా రికార్డులను సైతం తిరగరాయాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…