Ram Charan Peddi Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మన స్టార్ హీరోలందరూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం ప్రస్తుతం గ్లోబల్ స్టార్ (Global Star) గా అవతరించడమే కాకుండా ఇకమీదట రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాలనే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan ) బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్లో చేస్తున్న పెద్ది (Peddi) సినిమాతో మరోసారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో బుచ్చిబాబు ఉన్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే బుచ్చిబాబు పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా అవతరిస్తాడు. మీర్జాపూర్ (Mirjapur) సిరీస్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న మున్నాభాయ్ (దివ్యేందూ) సైతం ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లో అయితే నటిస్తున్నాడు.
ఆయన పోషించే క్యారెక్టర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ గా మనకు తెలుస్తోంది. మరి రామ్ చరణ్ ఇంతకుముందు ఫస్ట్ గ్లింప్స్ లో ఒక భారీ సిక్స్ అయితే కొట్టాడు. ఆ షాట్ ను ఎలివేట్ చేస్తూ గ్లింప్స్ కట్ అయితే ఇచ్చారు. మరి ఆ గ్లింప్స్ లో రామ్ చరణ్ కొట్టిన సిక్స్ మున్నాభాయ్ బౌలింగ్ చేస్తే వచ్చిందే అని కొన్ని కథనాలైతే వినపడుతున్నాయి.
ఇక మరికొంతమంది చెబుతున్న దాని ప్రకారం మున్నాభాయ్ రామ్ చరణ్ ఇద్దరూ ఒకే టీంలో ఉంటారని కానీ ఒకరంటే ఒకరికి పడదని వాళ్ల మధ్య కొన్ని విభేదాలు కూడా వస్తూ ఉంటాయని చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రామ్ చరణ్ మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తుంటే మున్నాభాయ్ సైతం పాన్ ఇండియాలో మరోసారి తన నటనతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు…