Kubera Success Event Incident: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో తెరెకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘కుబేర'(Kuberaa Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజుల్లో దాదాపుగా 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. నిన్న ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరగ్గా, ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా గురించి, సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరి గురించి అద్భుతంగా మాట్లాడి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈవెంట్ మొత్తం అద్భుతంగా సాగిపోయింది కానీ, శేఖర్ కమ్ముల స్పీచ్ చివర్లో నిర్మాత ప్రవర్తించిన తీరు చిరంజీవి ని సైతం షాక్ కి గురయ్యేలా చేసింది. ఇది సంఘటన చూసిన తర్వాత అంత పెద్ద డైరెక్టర్ పరిస్థితే ఇలా ఉంటే, ఇక అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చిన డైరెక్టర్స్ మరియు నటీనటుల పరిస్థితి ఏంటో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే నిన్న శేఖర్ కమ్ముల తన ప్రసంగం మొత్తం పూర్త అయ్యాక క్రింద కూర్చున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకే ఒక్క ఫోటో కావాలని శేఖర్ కమ్ముల ని కోరారు. అప్పుడు శేఖర్ కమ్ముల రండి స్టేజి మీదకు వచ్చేయండి గ్రూప్ గా ఫోటో దిగుదాం అంటాడు. ఇంతలోపు నిర్మాతలలో ఒకరు స్టేజి పైకి వస్తాడు. శేఖర్ కమ్ముల తో చాలా సీరియస్ గా మాట్లాడుతాడు. మైక్ కాస్త దగ్గరగా ఉండడం వల్ల ఆ నిర్మాత మాట్లాడిన మాటలు కాస్త వినపడ్డాయి. ఆ నిర్మాత నోటి నుండి ‘ఎంతసేపు మాట్లాడతావ్. అవతల చిరంజీవి గారు, నాగార్జున గారు వంటి వారు మాట్లాడాలి’ అని గుర్తు చేసినట్టుగా అనిపించింది.
ఎంత పెద్ద స్టార్ కి అయినా ఇలాంటివి చెప్పాల్సిందే కదా, ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నారు అని మీరంతా అనుకోవచ్చు. కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానం లో చెప్పలేదని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ ఘటన క్రింద నుండి చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, అసలు ఏమి జరుగుతుంది అన్నట్టుగా సీరియస్ గా చూస్తాడు. అనంతరం నిర్మాత కుమార్తె ని పిలిపించి మెగాస్టార్ చిరంజీవి ఎదో మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా ఎంత సమయమైనా పర్వాలేదు, ఈవెంట్ ని ఇలాగే కొనసాగించమని ఆమెతో చెప్పి ఉండొచ్చేమో. అయితే ఈ ఒక్క ఘటన చూసిన తర్వాత ఇండస్ట్రీ లో డైరెక్టర్స్ పరిస్థితి అర్థం అవుతుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా శేఖర్ కమ్ముల వెనక్కి తగ్గలేదు. తన డిపార్ట్మెంట్ మొత్తాన్ని స్టేజి పైకి పిలిచి ఫోటో తీసుకున్న తర్వాతనే క్రిందకు దిగాడు.
