https://oktelugu.com/

బిగ్ బాస్ 4 : హౌస్ లో నోయల్ క్రష్ తనే…?

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రతిరోజు రాత్రి తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇంకా అసలైన ఆటలోకి ఎవరూ దిగలేదు కానీ అప్పుడే ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలగడం స్టార్ట్ చేసేశారు. ఇవన్నీ ఒక నాలుగు రోజులు ఉంటాయి అనుకోండి అది వేరే విషయం. అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో లవ్ బర్డ్స్ ఎవరు అన్న విషయంపై అందరికీ ఎన్నో అంచనాలు ఉంటాయి. మొదటి మూడు నెలలు సీజన్లలో కనీసం సీజన్ కి రెండు […]

Written By: , Updated On : September 14, 2020 / 05:35 PM IST
Follow us on

singer noel in bigboss

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రతిరోజు రాత్రి తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇంకా అసలైన ఆటలోకి ఎవరూ దిగలేదు కానీ అప్పుడే ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలగడం స్టార్ట్ చేసేశారు. ఇవన్నీ ఒక నాలుగు రోజులు ఉంటాయి అనుకోండి అది వేరే విషయం. అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో లవ్ బర్డ్స్ ఎవరు అన్న విషయంపై అందరికీ ఎన్నో అంచనాలు ఉంటాయి.

మొదటి మూడు నెలలు సీజన్లలో కనీసం సీజన్ కి రెండు జంటలు బయటకు వచ్చాయి. తర్వాత వారు బయటకు వెళ్ళాక తమ జీవితాలలో భాగస్వాములుగా ఏర్పడలేదు అనుకోండి అయితే ప్రస్తుతం మాత్రం అందమైన అమ్మాయిలు…. ఆకట్టుకునే అబ్బాయిల సమాహారంతో బిగ్ బాస్ బాగానే నడుస్తోంది. వీరిలో మొదటి సీక్రెట్ రూమ్ లో జతపడి మంచి సాన్నిహిత్యం ఏర్పరచుకున్న అరియానా, సోహైల్ ఇప్పటికీ సన్నిహితంనే ఉంటున్నారు.

Also Read : హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

అలేఖ్య హారిక-అభిజిత్ మధ్య బాండింగ్ ఏర్పడుతున్నట్లు ప్రేక్షకులు గమనిస్తున్నారు. అభిజిత్ కూడా హారిక పైన కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అన్నట్లు సోషల్ మీడియాలో క్లిప్పింగులు బయటకు వస్తున్నాయి. ఇక వీరిలో మోనాల్ గజ్జర్ మంచి అందగత్తె అయినా కూడా ఆమె ఎవరితో ఎక్కువగా ఫ్రెండ్లీ గా ఉంటుంది అన్న విషయం ఎవరికీ క్లారిటీ రాలేదు. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ అన్ సీన్ వీడియో క్లిప్పింగులను ‘హాట్ స్టార్’ యాప్ లో ఉంచారు.

ఈ వీడియో లో మోనాల్ గంగవ్వ దగ్గర తెలుగు క్లాసెస్ నేర్చుకున్నప్పుడు గంగవ్వ మనిషి శరీరంలోని భాగాలను తెలుగులో ఏమంటారో తనకు చెబుతూ ఉంటుంది. అదవి పలుకుతూ.. గంగవ్వ ‘గుండె’ అన్నప్పుడు.. మోనాల్ తనకు తెలియక అప్పుడే అక్కడికి వచ్చిన నోయల్ వైపు చూపించి ‘నోయల్ నా గుండె’ అని అంటుంది. అక్కడితో నోయల్ సిగ్గుపడి వెళ్ళిపోతే తనకి ఏం జరిగిందో అర్థం కాదు.

తర్వాత ఆమెకి గుండె అంటే ‘హార్ట్’ అని అర్థమయ్యేలా వివరిస్తాడు సోహైల్. దీంతో మోనాల్ సిగ్గుమొగ్గలవుతుంది. ఇది చూసి సోషల్ మీడియాలో అందరూ మోనాల్ అమాయకత్వానికి…. తన ముద్దుముద్దు మాటలకు ఫిదా అయిపోతున్నారు. ఇక నోయల్ కి కూడా మోనాల్ పై క్రష్ ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ ల పై పోస్టులు వేస్తున్నారు.

Also Read : ‘బాలయ్య’ హీరోయిన్ ఆడిషన్స్.. ఇది పెద్ద బాధే !

Tags