జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో న్యాయం జరిగిందే…?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టులో తగిలిన ఎదురుదెబ్బలు అన్నీఇన్నీ కాదు. జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టుల నుంచి ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. పలు సందర్భాల్లో జగన్ సర్కార్ పై కోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియా జగన్ సర్కార్ పై కోర్టులు చేసిన వ్యాఖ్యల గురించి చేసిన విమర్శలు అన్నీఇన్నీ కావు. Also Read : […]

Written By: Navya, Updated On : September 15, 2020 11:14 am
Follow us on

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టులో తగిలిన ఎదురుదెబ్బలు అన్నీఇన్నీ కాదు. జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టుల నుంచి ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. పలు సందర్భాల్లో జగన్ సర్కార్ పై కోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియా జగన్ సర్కార్ పై కోర్టులు చేసిన వ్యాఖ్యల గురించి చేసిన విమర్శలు అన్నీఇన్నీ కావు.

Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?

అయితే ఎట్టకేలకు ఒక కేసు విషయంలో మాత్రం జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గత కొన్ని నెలల నుంచి ప్రతి కేసు విషయంలో మొట్టికాయలు తింటున్న జగన్ సర్కార్ కు రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ర‌మేశ్ ఆస్ప‌త్రి ఎండీ, చైర్మ‌న్ డాక్ట‌ర్ ర‌మేశ్‌బాబుపై జగన్ సర్కార్ విచారణకు అనుమతి కోరగా సుప్రీం కోర్టు అందుకు అంగీకరించింది.

ర‌మేశ్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం స్వ‌ర్ణ ప్యాలెస్ అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌ విషయంలో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణ జరిపి తదుపరి విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆస్ప‌త్రి ఎండీ డాక్ట‌ర్ ర‌మేశ్‌బాబు, సీతారామ్మోహ‌న్‌రావు క్వాష్ పిటిషన్లను వేర్వేరుగా దాఖలు చేయడంతో వాటిని విచారించి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అయితే సుప్రీం మాత్రం హైకోర్టు తీర్పును వ్యతిరేకించి విచారణను కొనసాగించాలని పేర్కొంది. ఏపీ సర్కార్ సుప్రీంను ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ సుప్రీం ఆదేశాలిచ్చింది. డాక్టర్ రమేశ్ ను అదుపులోకి తీసుకోకుండానే విచారించాలని కోరింది. సుప్రీం తీర్పు వైసీపీ నేతల్లో ఉత్సాహం నింపిందనే చెప్పాలి.

Also Read : బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు