https://oktelugu.com/

శ్రావణి కేసు: ఇద్దరి అరెస్ట్.. నిర్మాత కోసం వేట

టీవీ నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసు చిక్కుమడి వీడింది. ఈమె ఆత్మహత్యకు ప్రధానంగా ముగ్గురిని కారకులుగా పోలీసులు తేల్చారు. ప్రధానంగా సాయికృష్ణారెడ్డి, దేవరాజు రెడ్డిలతోపాటు ఆర్ఎక్స్ 100 మూవీ నిర్మాత అశోక్ రెడ్డిని కారకులుగా పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు కేసులో నిందితులుగా ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ముందు ప్రవేశపెట్టారు. Also Read : ‘బాలయ్య’ హీరోయిన్ ఆడిషన్స్.. ఇది పెద్ద బాధే ! ఈ సందర్భంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2020 / 05:32 PM IST
    Follow us on

    టీవీ నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసు చిక్కుమడి వీడింది. ఈమె ఆత్మహత్యకు ప్రధానంగా ముగ్గురిని కారకులుగా పోలీసులు తేల్చారు. ప్రధానంగా సాయికృష్ణారెడ్డి, దేవరాజు రెడ్డిలతోపాటు ఆర్ఎక్స్ 100 మూవీ నిర్మాత అశోక్ రెడ్డిని కారకులుగా పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు కేసులో నిందితులుగా ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ముందు ప్రవేశపెట్టారు.

    Also Read : ‘బాలయ్య’ హీరోయిన్ ఆడిషన్స్.. ఇది పెద్ద బాధే !

    ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా గుర్తించామన్నారు. దేవరాజ్, సాయికృష్ణతోపాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని నిందితుడిగా చేర్చామన్నారు. ఈ ముగ్గురూ శ్రావణిని ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటామని చెప్పారని .. ఆమెను పలు విధాలుగా వేధించారని తెలిపారు.

    శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ1గా సాయికృష్ణారెడ్డి, ఏ2గా నిర్మాత అశోక్ రెడ్డి, ఏ3గా దేవరాజు రెడ్డిని చేర్చినట్టుగా జాయింట్ సీపీ శ్రీనివాస్ తెలిపారు. దేవరాజురెడ్డితో శ్రావణికి సాన్నిహిత్యం ఏర్పడిందని.. అతడిని కలువవద్దని కుటుంబ సభ్యులు, సాయికృష్ణా రెడ్డి.. శ్రావణిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని సీపీ తెలిపారు. అదే మరణానికి కారణమైందన్నారు.

    Also Read : మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?

    2015లో సాయికృష్ణారెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడిందని.. మూడేళ్ల పాటు స్నేహం చేశారని సీపీ తెలిపారు. 2017లో శ్రావణికి నిర్మాత అశోక్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. 2019 ఆగస్టులో శ్రావణికి దేవరాజురెడ్డితో పరిచయం ఏర్పడిందన్నారు. దేవరాజురెడ్డితో స్నేహంగా ఉండడం సాయికృష్ణకు నచ్చలేదని.. అతడితో శ్రావణి కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా ఒత్తిడి తెచ్చారన్నారు.

    ఇక నిర్మాత అశోక్ రెడ్డి కూడా శ్రావణికి అవకాశాలు ఇప్పించి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని.. అతడు కూడా శ్రావణిని మోసం చేశాడని భావిస్తున్నట్టు జాయింట్ సీపీ తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు దేవరాజుతో శ్రావణి చాలా సేపు మాట్లాడిందని సీపీ తెలిపారు. దీన్ని బట్టి దేవరాజుతో శ్రావణి ప్రేమకు కుటుంబం, సాయికృష్ణ ఒప్పుకోవడం లేదని తెలుస్తోందన్నారు. దేవరాజు కూడా శ్రావణిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని తెలుస్తోందని సీపీ తెలిపారు. ఆ ఫోన్ కాల్ తర్వాతే శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు.

    దేవరాజు, సాయికృష్ణ, అశోక్ రెడ్డిలు శ్రావణిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారని జాయింట్ సీపీ తెలిపారు.శ్రావణిని ఈ ముగ్గురు మానసికంగా.. శారీరకంగా హింసించారని తెలిపారు. అందుకే ముగ్గురిపై కేసులు పెట్టామని తెలిపారు. శ్రావణి కుటుంబ సభ్యులెవరినీ ఈ కేసులో నిందితులుగా చూడడం లేదన్నారు.

    Also Read : హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?