https://oktelugu.com/

Sreeleela : రోజూ అది తింటా.. శ్రీలీల గ్లామర్ సీక్రెట్ ఇదా? క్యూట్ వీడియో వైరల్

Sreeleela : యంగ్ హీరోయిన్ శ్రీలీల గ్లామర్ సీక్రెట్ ఏమిటో తెలిసింది. ఆమె రోజూ ఆహారంలో ఒక రెసిపీని తింటున్నారు. శ్రీలీల లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో శ్రీలీల మాటలు చాలా క్యూట్ గా ఉన్నాయి.

Written By: , Updated On : February 22, 2025 / 10:45 AM IST
Sreeleela

Sreeleela

Follow us on

Sreeleela : టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావడంతో శ్రీలీల కెరీర్లో దూసుకుపోతుంది. అరడజను సినిమాలతో శ్రీలీల బిజీగా ఉంది. తెలుగు పవన్ కళ్యాణ్ కి జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ త్వరలో పునః ప్రారంభం కానుంది. అలాగే నితిన్ తో రాబిన్ హుడ్ చిత్రం చేస్తుంది. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. అలాగే రవితేజతో మరోసారి జతకడుతుంది. రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర చిత్రంలో శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రవితేజ-శ్రీలీల కాంబోలో వచ్చిన ధమాకా మంచి విజయం అందుకుంది.

పరాశక్తి చిత్రంతో కోలీవుడ్ లో అడుగుపెడుతుంది శ్రీలీల. శివ కార్తికేయన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనుంది. కార్తీక్ ఆర్యన్ కి జంటగా ఆషీకీ 3 చేస్తుంది. ఈ సినిమా విజయం సాధిస్తే హిందీలో శ్రీలీల బిజీ హీరోయిన్ అయినట్లే. పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే శ్రీలీల దేశం మొత్తాన్ని ఊపేస్తుంది. సౌత్ టు నార్త్ దున్నేస్తుంది.

శ్రీలీల ఎనర్జీ, గ్లామర్ ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. అదిరిపోయే డాన్సింగ్ స్కిల్స్ తో అభిమానులను కట్టిపడేస్తున్నాయి. కాగా శ్రీలీల గ్లామర్ రహస్యం లీకైంది. ప్రతిరోజూ ఆమె తినే ఒక రెసిపీని ఫ్యాన్స్ షో షేర్ చేసుకుంది. పల్లీల పొడి, కారం పొడి అన్నంలో కలుపుకు తినడం అంటే శ్రీలీలకు చాలా ఇష్టం అట. ప్రతి రోజూ ఆమె ఈ పదార్థం తింటారట. దీనికి సంబంధించిన వీడియో శ్రీలీల షేర్ చేయగా, ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మీ గ్లామర్ రహస్యం ఇదా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా శ్రీలీల ఎంబిబిఎస్ స్టూడెంట్. ఒక పక్క చదువుకుంటూనే మరోవైపు హీరోయిన్ గా రాణిస్తుంది. శ్రీలీల తల్లి బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్. అమెరికాలో శ్రీలీల పుట్టింది. భర్తతో విడిపోయిన తల్లి.. శ్రీలీలను తీసుకుని ఇండియాకు వచ్చేశారట. బాల్యం నుండి క్లాసిక్ డాన్స్ నేర్పించారు.