Sandeep Kishan
Sandeep Kishan : ప్రస్థానం వంటి అద్భుతమైన చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు సందీప్ కిషన్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో చిత్రాలు చేశాడు. సందీప్ కిషన్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కెరీర్లో సందీప్ కిషన్ నటించిన హిట్ చిత్రాల సంఖ్య చాలా తక్కువ. తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా టైటిల్ తో ఒక చిత్రం చేశాడు. రీతూ వర్మ, అన్షు అంబానీ హీరోయిన్స్ గా నటించారు. శివరాత్రి కానుకగా మజాకా మూవీ ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
కథ, పాత్ర నచ్చితే ఎలాంటి హోమ్ వర్క్ లేకుండా సెట్స్ కి వెళ్లిన నటించిన చిత్రాలు ఉన్నాయి. అలా చేసిన చిత్రాల్లో కొన్ని వర్క్ అవుట్ అయ్యాయి కూడాను. నేను అన్ని రకాల జోనర్స్ చేశాను. కానీ ఎంటర్టైనర్ చేయడం చాలా హాయిగా ఉంటుంది. మైఖేల్ వంటి సినిమాలు చేస్తూ పోతే సైకలాజికల్ గా డ్యామేజ్ అవుతుంది. ఒకే కథ మీద రెండేళ్లు పని చేయలేము. మజాకా వంటి సినిమాలు ఆడుతూపాడుతూ చేయవచ్చు.
గతంలో త్రినాథరావు నక్కిన రెండు కథలు వినిపించారు. అవి కొన్ని కారణాల వలన వర్క్ అవుట్ కాలేదు. మజాకా కథ నాకు తప్ప అందరికీ వినిపించాడు. చివరికి నా దగ్గరకు వచ్చింది. చిరంజీవి వద్దకు కూడా ఈ కథ వెళ్ళింది. ఆయన ఒకరోజు పిలిచి, మంచి కథ బాగా చేయమని ప్రోత్సహించారు. ఇన్నాళ్ల కెరీర్లో నేను నేర్చుకుంది ఏమిటంటే.. మంచి పీ ఆర్ టీమ్ ఉండాలి. మన గురించి, మన సినిమాల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉండాలి. లేకపోతే మనం ఏం చేసినా జనాలకు చేరదు. నిజం చెప్పే ధైర్యం ఉండాలి. లేదంటే అబద్దాన్ని నిజం అని చెప్పించడానికి వంద మంది అయినా ఉండాలి.
చిరంజీవి, రజినీకాంత్, పవన్ కళ్యాణ్ నాకు స్ఫూర్తి. చిరంజీవి, రజినీకాంత్ స్వశక్తితో ఎదిగారు. డార్క్ స్కిన్ తో కూడా ఇండస్ట్రీని ఏల వచ్చని రజినీకాంత్ నిరూపించారు. ధనుష్, పవన్ కళ్యాణ్, విజయ్ కెరీర్ బిగినింగ్ లో చేసిన సినిమాలకు ఇప్పటి సినిమాలకు పోలికే ఉండదు. ఊహించని ట్రాన్స్ఫర్మేషన్ వారు సాధించారు… అని సందీప్ కిషన్ అన్నారు.