Bigg Boss Shanmukh: యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లతో పాటు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ చాలా మందిని అట్రాక్ట్ చేశాడు షణ్మక్ జస్వంత్. స్టాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ అనే వెబ్ సిరీస్ తో అతడు ఒక్క సారిగా చాలా ఫేమస్ అయ్యాడు. దీంతో అతని క్రేజ్ మారిపోయింది. ఈ సిరిస్ మంచి హిట్ సాధించడంతో అతని ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చాడు ఈ యూట్యూబ్ స్టార్.

చివరి వరకు గేమ్ లో కొనసాగాడు. ఈ క్రమంలో అతడే విన్నర్ గా నిలుస్తాడని చాలా మంది అనుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పాజిటివ్ టాక్ సొతం చేసుకున్నాడు. అనంతరం సిరితో కాస్త హద్దులు దాటుతూ ప్రవర్తించాడు. ముద్దులు, హగ్గులతో తన క్రేజ్ ను మరింత దిగజార్చుకున్నాడనే చెప్పాలి. అలాగే సిరి గురించి కాస్త పొసెసిస్ గా మాట్లాడటం, ఆమెపై సీరియస్ అవుతూ అవరవడం లాంటివి షణ్ముక్ స్థాయిని మరింత తగ్గించాయనే చెప్పాలి. చిరవకు బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ను సన్నీ దక్కించుకోగా.. షణ్ముక్ రెండో ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు.
Also Read:</Bigg Boss 5 Shanmukh and Siri: హౌస్ లో షణ్ముఖ్-సిరి ఏం చేశారు?… సన్నీ మెడకు చుట్టుకున్న వ్యవహారం
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు దీప్తి, షణ్ముక్ లవ్ లో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. శ్రీహాన్, సిరి సైతం ఎంగేజ్ మెంట్ చేసుకున్న తర్వాత సిరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముక్ చేసిన వ్యవహారాలు వీవర్స్ కు నచ్చలేదు. వీరి ఇద్దరి విషయంపై సోషల్ మీడియాలో చాలానే ప్రచారం జరిగింది. బిగ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
రూమర్స్ రావడం కొత్తేమీ కాదంటూ షణ్ముక్ తేల్చి చెప్పాడు కూడా. ఇదిలా ఉండగా ఇటీవలే ఇన్ స్టా లైవ్ లోకి వచ్చాడు షణ్మక్… తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ వారి ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. చాలా మంది దీప్తి గురించి పలు ప్రశ్నలు అడగడంతో వారి వ్యవహారంపై ఆయన స్పందించాడు. ప్రస్తుతం ఆమె తనను బ్లాక్ చేసిందని చెప్పుకొచ్చాడు షన్నూ. తానకు కోపమొచ్చినా, అలిగినా.. ఇలానే బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పాడు. తొందరలోనే హైదరాబాద్ కు వెళ్లి ఆమెను కలుస్తానని ఆన్సర్ ఇచ్చాడు. నా వల్ల దీప్తి చాలా నెగిటివిటీని ఎదుర్కొందని చెప్పాడు.