Jakie Shroff: జ్యోతిష్యం, జాతకాలనగానే ఈ జనరేషన్ ముఖ్యంగా యువత కొట్టిపడేస్తుంటుంది. అవన్నీ మూఢనమ్మకాలని, అందులో అసలు సెన్స్ లేదని తీసిపడేస్తుంటారు. కొంతమంది అందులోనే జీవితమంతా ఉందని భావిస్తుంటారు. వీరిద్దరి ఆపోజిట్‌గా ఇంకో గ్రూప్ ఉంటుంది. నమ్మని దాని మీద అపహాస్యం చేయడం. అయితే, తాజాగా, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ జోతిష్యాన్ని అవహేళన చేయొద్దని అంటున్నాడు.

1990ల్లో బాలీవుడ్‌ను ఓ రేంజ్లో ఏలి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. తెలుగులోనూ ‘శక్తి’, ‘పంజా’, ‘సాహో’, ‘బిగిల్’ సినిమాలతో ఆకట్టుకున్నాడు జాకీ. కాగా అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనగా.. కార్యక్రమంలో జాకీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలోనే జ్యోతిష్టంపై తనకున్న నమ్మకాన్ని తెలిపారు.
నాకు 10ఏళ్ల వయసున్నప్పుడు నా సోదరుడు చనిపోయాడు. అప్పుడు వాడి వయసు 17ఏళ్లు. ఓ వ్యక్తిని కాపాడుతూ మా అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికీ వాడు మా మనసులో సజీవంగానే ఉన్నాడు. అయితే, మా నాన్న ముందుగానే ప్రమాదాన్ని ఊహించి హెచ్చరించాడు. కానీ, మా అన్నయ్య ఆ మాటలను లెక్కచేయలేదు.
మా అన్న ఆ సమయంలో ఓఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆ రోజు అతనికి బాలేదని.. బయటికి ఎక్కడికీ వెళ్లొద్దని మా నాన్న అన్నారు. కానీ, వినకుండా సముద్రంలో పడిపోతున్న ఓ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో చనిపోయాడు. అని వివరించారు. జ్యోతిష్యాన్ని చాలా మంది అపహాస్యం చేస్తారని.. కానీ, నా సోదరుడి విషయంలో మా నాన్న ఊహించింది నిజంగానే జరిగిందని అన్నారు. ఈ విధంగా తన అనుభవాలను పంచుకున్నారు జాకీ ష్రాప్.