Homeఎంటర్టైన్మెంట్RRR: రామ్​చరణ్ ఇంట్రడక్షన్​ సీన్​ వింటే పూనకాలే.. ఏకంగా 2వేల మంది ఆర్టిస్టులతో!

RRR: రామ్​చరణ్ ఇంట్రడక్షన్​ సీన్​ వింటే పూనకాలే.. ఏకంగా 2వేల మంది ఆర్టిస్టులతో!

RRR: ప్రస్తుతం ఇండియన్​ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఆర్​ఆర్​ఆర్​ అనే మాట తప్ప ఇంకేం వినిపించడం లేదు. అంతలా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఆర్​ఆర్​ఆర్​. తారక్​, రామ్​చరణ్​ వంటి స్టార్​ హీరోలతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్​ను సృష్టిస్తున్నాయి. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరు 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లలో దూసుకువెళ్తోంది ఆర్​ఆర్​ఆర్ టీం.

rajamouli-made-interesting-comments-that-the-ram-charan-entry-scene

కాగా, రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో హీరో ఇంట్రడక్షన్ మాములుగా ఉండదు. అలాంటిది ఇద్దరు హీరోలను ఏ రేంజ్​లో పరిచయం చేయనున్నాడనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించారట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడని ఆయన.. ఈ విషయంపై గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

రామ్​చరణ్​ను పరిచయం చేసే సన్నివేశం సినిమాకే హైలైట్​గా నిలవనుందట. ఇందుకోసం ఏకంగా 2వేల మంది జూనియర్ ఆర్టిస్టులను రంగంలోకి దింపినట్లు వివరించారు. ఈ సీన్​ తీసేటప్పుడు నేనే చాలా ఎగ్జైట్​ అయిపోయా.. ఇక ప్రేక్షకులు చూస్తే అసలు కుర్చీల్లోకూర్చోరు. ఈ సినిమాలో ఒక సీన్​ను మించి మరో సీన్ ఉంటుంది. అయినా, రామ్​చరణ్​ ఇంట్రడక్షన్​ మాత్రం వేరే లెవెల్​లో ఉంటుంది.. అని రాజమౌళి చెప్పుకోచ్చారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular