Sanju Samson: టీమిండియాకు మరో ధోని దొరికాడు. చివర్లో చెలరేగి ఆడి తన ప్రతిభ నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అతడి ఆట తీరు చూస్తుంటే అచ్చం ధోనిని చూస్తున్నట్లే అనిపిస్తుంది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా వచ్చి తన బ్యాట్ తో సమాధానం చెబుతున్నాడు. ధోనిలా వికెట్ కీపర్ అయినా బ్యాట్ తో కూడా ధోనిలాగే మెరుపులు మెరిపిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో అతడి ఇన్నింగ్స్ అందరు ఫిదా అయ్యారు. అతడే సంజు శాంసన్. భారత జట్టుకు దొరికిన ఆణిముత్యం. దీంతో ఇక మీదట ధోని మెరుపులు అతడి బ్యాట్ లో చూసుకోవచ్చు. చివరి ఓవర్ లో దంచికొట్టుడు చూస్తుంటే ధోనిలా అనిపించడం మామూలు విషయం కాదు.

మ్యాచ్ ఓడినా మనకు ఓ ధోని దొరికాడని చెబుతున్నారు. టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమ పాలైనా ధోని లాంటి ఆటగాడు మనకు మరొకరు ఉన్నాడని సంబరపడుతున్నారు. సఫారీలతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 40 ఓవర్ల మ్యాచ్ లో 250 పరుగుల టార్గెట్ ను చేధించే క్రమంలో టీమిండియా 8 పరుగులకే ఓపెనర్లు వెనుదిరగడంతో పరాజయం కలిగింది. గైక్వాడ్, ఇషాన్ కిషన్ తక్కువ పరుగులకే ఔటు కాడంతో వికెట్ కీపర్ సంజు శాంసన్ 86 పరుగుల భారం తన భుజాలపై వేసుకున్నాడు.
శాంసన్ కు శ్రేయాస్ అయ్యర్ తోడవడంతో స్కోరు బోర్డు ఉరుకులు పెట్టింది. అయ్యర్ ఔట్ కావడంతో ఓటమి ఖారారైంది. చివరి ఓవర్ లో టీమిండియా 36 పరుగులు చేయాల్సి రావడంతో శాంసన్ పవర్ హిట్టింగ్ చూపించాడు. 6,4,4,0,4,1 బౌండరీలు సాధించడంతో విజయానికి దగ్గరైనా అపజయం మాత్రం పలకరించింది. కానీ శాంసన్ దూకుడు చూస్తుంటే అందరికి ఆశ్చర్యం వేసింది. ధోని లాంటి మరో క్రికెటర్ మనకు దొరకడం నిజంగా మనకు అదృష్టమే. దీంతో శాంసన్ ఆటతీరుకు అందరు మంత్రముగ్దులయ్యారు.

వికెట్ కీపర్ శాంసన్ వీరోచిత పోరాటంతో ధోనిని తలపించాడు. 30 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉండగా శాంసన్ ధోని లా చెలరేగాడు. చివరి బంతి వరకు తన శాయిశక్తులా ఆడాడు. కానీ చివరి ఓవర్ లో 30 పరుగులు చేయాల్సి ఉండగా ఆకాశమే హద్దుగా పరుగులు రాబట్టాడు. మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లినా కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి చెందడం బాధాకరమే. కానీ శాంసన్ ఇన్నింగ్స్ కు పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. శాంసన్ ఆటతీరును చూసిన వారు ఔరా అనుకున్నారు. ధోని లాంటి ఆటగాడు మనకు దొరకడం నిజంగా మనకు ఎంతో ప్రయోజనమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.