Director Shankar: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు కమలహాసన్…ఒకప్పుడు ఆయన సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుందని ప్రతి ప్రేక్షకుడు నమ్మేవాడు. అలానే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన ప్రతిసారి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసి సక్సెస్ సాధిస్తూ వచ్చాడు. ఇలాంటి సమయంలోనే ఆయన చేసిన భారతీయుడు సినిమా ఆయనకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో కమలహాసన్ వేరే సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రొడ్యూసర్ ఏ ఏం రత్నం అడగడం వల్ల డేట్స్ ఇచ్చాడు.
ఇక కమలహాసన్ ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నప్పటికీ కమలహాసన్ సన్నిహితులు కొంతమంది మాత్రం శంకర్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేశాడు. నీలాంటి స్టార్ హీరోని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఆయన దగ్గర లేదు ఆయన ఒక పిల్ల బచ్చ ఆయనతో సినిమా ఎందుకు చేస్తున్నావు. అనవసరంగా టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావని కమలహాసన్ బ్రెయిన్ ను చాలా రకాలు డిస్టర్బ్ చేసారట. అయినప్పటికీ కమలహాసన్ మాత్రం శంకర్ మీద నమ్మకంతో ఉన్నారట. ఇక శంకర్ కథ ఫైనలైజ్ చేసిన తర్వాత కమల్ హాసన్ కి కూడా చాలా డౌట్లు వచ్చాయట. అవి ఏంటి అంటే ఫ్రీడమ్ ఫైటర్ గా ఫైట్ చేసిన సేనాపతి ఏజ్ అయిపోయిన తర్వాత కామ్ గా ఒక పల్లెటూరులో కూర్చొని ఉంటాడా ఆయన వేరే ఏమీ పని చేయడా దీనివల్ల మనం సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాం అంటూ కమలహాసన్ శంకర్ మీద చాలా ప్రశ్నలు సంధించారట.
కానీ శంకర్ మాత్రం తను చెప్పేది కరెక్ట్ గానే ఉంది అని సేనాపతి ఇలా ఉండడమే కరెక్ట్ అని చెప్పారట. అయినప్పటికి కమలహాసన్ కన్విన్స్ అవ్వలేదు. అయినా కూడా ఎన్నో డౌట్లు ఉన్నప్పటికి కమలహాసన్ డేట్స్ ఇచ్చాడు కాబట్టి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయిన చచ్చినట్టు సినిమా చేయాల్సిందే అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. కానీ రెండు షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత కమలహాసన్ కి తెలిసింది. ఇది ఒక మామూలు సినిమా కాదు ట్రెండ్ సెట్టర్ గా నిలవబోతుందని…ఇక తెరకెక్కించేవాడు మామూలు డైరెక్టర్ కాదు తొందర్లోనే ఇండియా ను ఏలబోయే డైరెక్టర్ అని అప్పుడు అర్థం అయిందట. ఇక శంకర్ ను వదులుకునే ఉద్దేశ్యం లేక కమలహాసన్ వెంటనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటే రెడీ చెయ్ మనం ఈ సినిమా చేద్దామని చెప్పారట. అయినప్పటికి శంకర్ దగ్గర అప్పుడు సీక్వల్ కథ లేదు అని చెప్పాడట. ఇక సేనాపతి క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానం అయితే అద్భుతంగా ఉండడమే కాకుండా సేనాపతి షూట్ ఉన్న రోజు కమలహాసన్ తో తెరకెక్కించే ప్రతి సీన్ ను శంకర్ స్పెషల్ కేర్ తీసుకొని మరి తెరకెక్కించారట.
ఆయన మేకింగ్ ఆయన విజువలైజేషన్ చూసిన కమలహాసన్ కి ఈ సినిమా నేను మిస్ అయిపోతే లైఫ్ లో చాలా మిస్ అయ్యేవాడిని అని అనిపించేదట. ఇక 1996 మే 9 వ తేదీన భారతీయుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాతో శంకర్ స్టామినా ఏంటో తమిళ్, తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేసింది. శంకర్ మీద వచ్చిన ప్రతి కామెంట్ కు సమాధానం చెప్పాడు. శంకర్ ను విమర్శించిన వారే ప్రశంసించడం మొదలుపెట్టారు.
ఇక కమల్ హాసన్ సైతం సీక్వెల్ కథ ఉంటే తొందరగా రెఢీ చెయ్ డేట్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తానని చెప్పారట. అయినప్పటికి శంకర్ మాత్రం ఇప్పుడు సీక్వెల్ చేసే ఉద్దేశ్యం తనకు లేదని వేరే సినిమా చేయబోతున్నానని చెప్పాడట… ఇక మొత్తానికైతే అప్పుడు మిస్ అయిన సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కింది. ఇక ఈ రోజు రిలీజ్ అయిన భారతీయుడు 2 సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది…