Tollywood: ప్రపంచంలో అనేక వింతలు చోటు చేసుకుంటాయి. అలాంటిదే ఇది కూడా. ఓ నటుడు ఏకంగా నాలుగు వివాహాలు చేసుకున్నాడు. ఆయన కుమారుడికి 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు. అలాగే ఆ నటుడు కొడుకుని పట్టించుకున్న దాఖలాలు ఉండవు. పైగా ఆ నటుడు ఆస్తి విలువ 1000 కోట్లు అట. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో చెప్పాడు. ఆయనకు హైదరాబాద్ కి నడిబొడ్డులో 12 ఎకరాల పొలం ఉంది. నాలుగు ఎకరాలు ఫార్మ్ హౌస్ గా ఉంచేశాడు. మిగతా 8 ఎకరాలు కమర్షియల్ ఏరియాగా డెవలప్ చేశాడు.
మీ నాన్నకు నాలుగు వివాహాలు అయ్యాయి. నీకు ఇంకా పెళ్లి కాదని అడిగితే ఆ హీరో ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటారా? నరేష్. విజయనిర్మల కుమారుడైన నరేష్ కి నాలుగు వివాహాలు జరిగాయి. ముగ్గురు కొడుకులు ఉన్నారు. వారిలో నవీన్ విజయ్ కృష్ణ పెద్దవాడు. ఆయనకు ఇంకా వివాహం కాలేదు.
నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో ఆయనకు వివాదం నడుస్తుంది. ఆయన వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. మూడు పెళ్లిళ్లు చేసుకుని విఫలం అయ్యాడు నరేష్. లేటు వయసులో నటి పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. అప్పట్లో వీరిద్దరి మధ్య సంబంధం సోషల్ మీడియాలో రచ్చ అయ్యింది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఉంటున్నారు. తనకు దొరికిన నమ్మకమైన మనిషి పవిత్ర అని నరేష్ అంటారు.
నరేష్-పవిత్రలకు పెళ్లి జరిగిందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. కాగా నరేష్ నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే అతని కొడుకు నవీన్ విజయ్ కృష్ణ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వయసు దాటినా బ్యాచ్ లర్ గా ఉన్నాడు. మీ నాన్నకు నాలుగు పెళ్లిళ్లు నీకు ఇంకా పెళ్లి కాలేదని… నవీన్ విజయ్ కృష్ణ ని అడిగితే ఊహించని సమాధానం చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో తండ్రికి నాలుగు పెళ్లిళ్లు కానీ కొడుకు ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉండిపోయాడు అని విమర్శలు ఉన్నాయి.
వీటిపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా .. ఆయన మాట్లాడుతూ .. అసలు ఈ విషయాలను నేను పట్టించుకోను. అనవసరమైన వాటి గురించి ఆలోచించి నా ఎనర్జీ వేస్ట్ చెయ్యను. ఇతరుల గురించి చెప్పుకొని ఆనందపడటం జనాల నేచర్. మనం ఎవరినీ ఆపలేం. ఈ మాట్లాడే వాళ్లంతా ఆయన ఆర్థికంగా, వ్యక్తిగతంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేదు కదా. ఆయన పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు అనుకుంటారు. ఆయన పడిన కష్టాలు ఎవరికీ తెలియదు.
ఆయన జీవితం ఆయనది. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని అన్నారు. మీరు ఇంతవరకు మ్యారేజ్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా .. నా కెరీర్ పట్ల ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. చేసుకోవాలి అనిపిస్తే చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే రైట్ టైం లో చేసుకుంటే బెటర్. నేను లవ్ లైఫ్ గెలవలేకపోయాను. నేను ఏ పనైనా చేస్తాను కానీ మానసికంగా ప్లాన్ చేయలేను.ఎవరో ఒకరు లైఫ్ లోకి రాసి పెట్టి ఉంటే వస్తారు. లేదంటే ఎప్పటికీ ఇంతే అని చెప్పారు. నవీన్ కృష్ణ మూడు చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ ఆయనకు బ్రేక్ రాలేదు. త్వరలో దర్శకత్వం వహించనున్నాడు.