మొన్న ‘శుక్ర’ అనే చిన్న సినిమా ఒకటి రిలీజ్ అయింది. టైటిల్ వింటేనే అర్ధమవుతుంది ఈ సినిమా ఏ స్థాయి సినిమానో అని. ఇప్పుడు ఈ చెత్త సినిమా వల్ల ఐమాక్స్ ఒక చెత్త రికార్డ్ ను తన పేరిట రాయించుకోవాల్సి వచ్చింది. నిజానికి ఐమాక్స్ లో సినిమా చూడాలని నిత్యం వందల మంది ఐమాక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. లాక్ డౌన్ చివరి సమయంలో కూడా ఐమాక్స్ ను ఓపెన్ చేస్తే.. జనం ఫుల్ గా వెళ్లారు. అలాగే థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత కూడా ఐమాక్స్ కి జనం బాగానే వెళ్లారు. గత నెల వరకూ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ఐమాక్స్ ఫుల్ రద్దీగా కొనసాగింది. పైగా కరోనా నివారణ చర్యలను పక్కాగా పాటించడంతో ఫ్యామిలీస్ కూడా ఐమాక్స్ వైపే వెళ్లేవారు.
మొత్తానికి వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాల రిలీజ్ అప్పుడు ఐమాక్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. సినిమా అంటే సగటు జనం అంతగా పడిచస్తారు. అందునా ఐమాక్స్ లోనే బొమ్మ చూడటం ఎవ్వరికీ మాత్రం ఇష్టం ఉండదు. సినిమా పై ఇంట్రస్ట్ లేని వాడు కూడా ఐమాక్స్ లో సినిమా చూడటానికి ఇష్టపడతాడు. అంత మంచి పేరు ఉంది ఐమాక్స్ కి, కానీ ఇప్పుడు ఆ పేరు శుక్ర అనే సినిమాతో పోయింది. కరోనా భయం వల్ల మొన్న షోలకు జనం పెద్దగా రాలేదు అట. రెండు మూడు షోలకు అయితే గట్టిగా నాలుగు టికెట్స్ కూడా అమ్ముడుపోలేదని తెలుస్తోంది.
నిజంగా ఐమాక్స్ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. డబ్బింగ్ సినిమాలు వేసుకున్నా జనం వెళ్లేవారు. అలాంటిది ఒక తెలుగు డైరెక్ట్ సినిమా వేస్తే గట్టిగా నలుగురు కూడా లేకపోవడం బాధాకరమైన విషయమే. అసలు ఫుల్ క్రౌడ్ ఉండే ఐమాక్స్ లో అసలు కలెక్షన్స్ లేవు అంటే… ఎంతగా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా అయితే అసలు ఐమాక్స్ లాంటి థియేటర్ల సంస్థను ఎలా నడపాలి అంటూ నిర్వాహకులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. దీనిబట్టి ఊరుపేరు లేని సినిమాని థియేటర్స్ లో వేస్తే.. సమోసా డబ్బులు కూడా రావు అని తేలిపోయింది. అనవసరంగా మంచి థియేటర్స్ కి బ్యాడ్ నేమ్.