https://oktelugu.com/

Chiranjeevi- Ravi Teja: చిరు, రవితేజలకు అవమానం..

వాల్తేరు వీరయ్య జెమినీ టీవీలో ప్రసారమైంది. థియేటర్లలో ఆదరించినట్టే టీవీలో కూడా ఆదరిస్తారు అనుకున్నారు అంతా.. కానీ ఊహించని రేంజ్ లో టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 3, 2023 6:43 pm
    Chiranjeevi- Ravi Teja

    Chiranjeevi- Ravi Teja

    Follow us on

    Chiranjeevi- Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లలో ఎలా క్యూ కడుతారో.. టీవీలకు కూడా అదే విధంగా అతుక్కుపోతుంటారు. అయితే సంక్రాంతి సందర్భంగా వచ్చిన వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ తో నిలిచింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తే.. మరో హీరోగా రవితేజ నటించారు. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా దసరా సినిమా సందర్బంగా బుల్లితెరపై ప్రసారం అయింది.

    వాల్తేరు వీరయ్య జెమినీ టీవీలో ప్రసారమైంది. థియేటర్లలో ఆదరించినట్టే టీవీలో కూడా ఆదరిస్తారు అనుకున్నారు అంతా.. కానీ ఊహించని రేంజ్ లో టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా. టీవీలో ప్రసారమైన వాల్తేరు వీరయ్య కేవలం 5.14 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే రాబట్టింది. చిరంజీవి లాంటి పెద్ద హీరోకు ఈ టీఆర్పీ రేటింగ్ చాలా అవమానకరమైన విషయమే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయినా మల్టీ స్టారర్ సినిమా, ఇద్దరు ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ సినిమాకు ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతో ముక్కున వేలు వేసుకుంటున్నారు నెటిజన్లు.

    ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే.. కేథరిన్ థెరిసా కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న టీవీలో మాత్రం వెనుకబడింది. అయినా ఓటీటీలో వచ్చిన ఈ సినిమాను ముందే అందరూ వీక్షించారు. దీంతోనే టీవీలో టీఆర్పీ రేటింగ్ రాలేదని రవితేజ, చిరు అభిమానులు అంటున్నారు. అయితే అర్బన్ లో 5.14 రేటింగ్ రాగా.. రూరల్ అండ్ అర్బన్ లో 4.56 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. చిరు కెరీర్ లో అమెరికాలో 2 మిలియన్స్ అందుకున్న మూడో సినిమాగా నిలిచింది వాల్తేరు వీరయ్య.