WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఆ ఫీచర్స్ తో పండుగే..

వాట్సాప్ లో టెక్ట్స్ మెసెజ్ నుంచి వీడియోల వరకు పంపుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా వాట్సాప్ ద్వారా చాట్ చేయొచ్చు. టెక్స్ట్ తో పాటు ఫొటోలు, వీడియోలు పంపించుకోవచ్చు.

Written By: Chai Muchhata, Updated On : November 3, 2023 6:44 pm
Follow us on

WhatsApp: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరి. అందులో వాట్సాప్ కంపల్సరీ. వాట్సాప్ యూజ్ చేయని వినియోగదారులు వెతికినా దొరకరు. విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ మాతృసంస్థ మెటా సైతం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వారికి అనుగుణంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే స్క్రీన్ షేరింగ్, వీడియో కాలింగ్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన మెటా తాజాగా సరికొత్త ఫీచర్స్ తో రాబోతుంది. ఆ వివారల్లోకి వెళితే..

వాట్సాప్ లో టెక్ట్స్ మెసెజ్ నుంచి వీడియోల వరకు పంపుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా వాట్సాప్ ద్వారా చాట్ చేయొచ్చు. టెక్స్ట్ తో పాటు ఫొటోలు, వీడియోలు పంపించుకోవచ్చు. కొందరు ఉద్యోగులు, వ్యాపారులు సైతం ఎక్కువ సైజ్ ఉన్న ఫైళ్లను వాట్సాప్ ద్వారానే పంపించుకుంటున్నారు. అయితే వాట్సాప్ ద్వారా ఫొటోలను పంపించడం ద్వారా రిజల్యూషన్ సైజ్ తగ్గుతూ ఉండేది క్లారిటీ ఉన్న ఫొటో వాట్సాప్ ద్వారా పంపినప్పుడు ఫొటో పగిలినట్లు అయ్యేది. ఇటీవల ఈ సమస్యను అర్థం చేసుకున్న మెటా సంస్థ హెచ్ డీ ఫొటోలను కూడా పంపించుకునే విధంగా యాప్ ను మార్చేసింది.

తాజాగా వీడియోల విషయంలోనూ కొన్ని మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి వీడియోలు అయినా ఇతరులకు సెండ్ చేయడం ద్వారా తక్కువ సైజ్ తో ఫార్వాడ్ అయ్యేవి. దీంతో వీడియోలో క్లారిటీ ఉండేది కాదు. తాజాగా క్లారిటీ ఉన్న వీడియోలను కూడా పంపించుకోవచ్చని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. అయితే 2 జీబీ వరకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. అంతకంటే ఎక్కువ సైజ్ పంపించే అవకాశం లేదని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు వీడియో ఫైల్స్ వీ ట్రాన్సఫర్, క్విక్ షేర్ లాంటివి ఉండేవి. ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తే ఎలాంటి క్వాలిటీ కోల్పోకుండా ఉంటుందని చెబుతున్నారు. ఈ సదుపాయం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే ఫొటోలు, వీడియోలను డాక్యమెంట్ రూపంలో పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫొటోలను డాక్యమెంట్ ద్వారా పంపుతున్నారు. ఇప్పుడు వీడియోలు కూడా అలాగే పంపించే విధంగా సెట్ చేయనున్నారు.