Shalini Pandey
Shalini Pandey: దక్షిణాది నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి షాలిని పాండే గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తన నటన, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అయితే తన ఒక ప్రకటన వల్ల వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. నిజానికి, తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకుంటూ బాధ పడింది. ఆ నటి ఒక ఓ డైరెక్టర్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని తెలిపింది. ఒకరోజు తాను వానిటీ వ్యాన్‌లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో జరిగిన బాధాకరమైన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
Also Read: సమంత బాటలోనే నడుస్తున్న అక్కినేని కొత్త కోడలు…మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా..?
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాలిని పాండే తన నటనా జీవితం, అప్పుడు ఎదుర్కొన్న విషయాల గురించి తెలిపింది. తన కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని.. ఎప్పుడు కూడా మంచి పురుషులు తనకు తార పడలేదు అని తెలిపింది. తెరపై, తెర వెనుక, సిబ్బందిలో కూడా చాలా మంది భయంకరమైన వ్యక్తులు ఉండేవారని, వారితో కలిపి పని చేయడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది అని గుర్తు చేసుకుంది షాలినీ పాండే. అయితే ఇలాంటి సమయాల్లోనే మన పరిమితులను మనం నిర్ణయించుకోవాలి అని సూచించింది. తన కెరీర్‌లో, తను కూడా చాలా అస్తవ్యస్తమైన పురుషులను ఎదుర్కున్నట్టు తెలిపింది.
అయితే తాను సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రాలేదని..అందుకే మొదట్లో ఎలా ఉండాలో? ఎవరు ఎలాంటి వారూ తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేదని. ఎలా నిర్వహించాలో కూడా తనకు తెలియదు అని చెప్పింది. తన కెరీర్ ప్రారంభంలో ఒకసారి, ఓ సినిమాలో పనిచేస్తున్నప్పుడు దారుణమైన సంఘటన జరిగిందట. అయితే ఒక రోజు సెట్‌లో, ఆ సినిమా దర్శకుడు తన వ్యాన్‌లోకి చెప్పకుండానే ప్రవేశించాడట. ఆ సమయంలో తను బట్టలు మార్చుకుంటుందట. ఆ డైరెక్టర్ ను చూసి చాలా భయపడిందట షాలినీ. ఈ ఊహించని పరిమాణానికి భయపడి డైరెక్టర్ మీద చాలా అరిచిందట షాలినీ.
ఆ సమయంలో తన వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే అని తెలిపింది షాలినీ. అయితే ఆ తర్వాత కొందరు అలా డైరెక్టర్ మీద అరవడం కరెక్ట్ కాదని తెలిపారట. అయినా సరే దాని గురించి ఆలోచించకుండా అరిచాను అని పేర్కొంది. పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోయానని తెలిపింది. అయినా మర్యాద ఎక్కడ ఉంది? కొత్త అమ్మాయిని అయితే తలుపు తట్టకుండా లోపలికి రావచ్చా? ఆ క్షణం నన్ను నేను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అరిచాను అని తెలిపింది. అయితే కాలక్రమేణా నటి అలాంటి పరిస్థితులను భిన్నంగా నిర్వహించడం నేర్చుకుందట. ‘కోపంగా స్పందించే బదులు, ఈ విషయాలను ఎలా ఎదుర్కోవాలో తరువాత తనకు అర్థమైందని చెప్పింది షాలిని పాండే.
వర్క్ ఫ్రంట్ గురించి చెప్పాలంటే, షాలిని పాండే చివరిసారిగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి మహారాజ్, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ డబ్బా కార్టెల్‌లో కనిపించింది. ఆమె ఇప్పుడు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడై కోసం సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమాలు బ్యూటీకి ఎలాంటి రెస్పాన్స్ ను అందిస్తాయో చూడాలి.