Samantha
Samantha : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి, కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. వాళ్లు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ల కంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు… ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాటపడుతూ వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు…ఇక హీరోయిన్లు మాత్రం కొన్ని సినిమాలకే పరిమితమవుతున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తద్వారా వాళ్ళు చేయబోతున్న సినిమాలతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు అనేది తెలియాల్సి ఉంది. అక్కినేని ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆ ఫ్యామిలీలో ఉన్న హీరోలందరు సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక నాగచైతన్య హీరోగా రాణిస్తున్నప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు ఇంతకు ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె కూడా హీరోయిన్ కావడంతో పెళ్లి తర్వాత ఆమె సినిమాలో నటిస్తుందా లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శోభిత తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగచైతన్య నాగార్జున దీనికి ఒప్పుకుంటారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక మొత్తానికైతే అక్కినేని వారి ఇంటి కోడలు పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని వాళ్ళు ఒక నిబంధన అయితే పెట్టినట్టుగా తెలుస్తోంది.
Also Read : నిర్మాతగా కూడా సమంత సక్సెస్ అయ్యినట్టే..ఆకట్టుకుంటున్న ‘శుభం’ టీజర్ !
కానీ హీరోయిన్లను పెళ్లి చేసుకోవడంతో వాళ్లు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం శోభిత సైతం సమంత మాదిరిగానే సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుందా? ఈ విషయంలో నాగచైతన్య ఒప్పుకున్నాడా? నెక్స్ట్ శోభిత ఏం చేయబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ముగ్గురు వరుస సినిమాలు చేస్తున్నప్పటికి వాళ్ళు అనుకున్న రేంజ్ లో సక్సెస్ మాత్రం సాధించలేకపోతున్నారు. తమ తోటి హీరోలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో వీళ్ళు మాత్రం వెనుకబడిపోవడం చూస్తున్న వాళ్ళ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలందరితో పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ప్రస్తుతం ఉన్న హీరోలందరూ పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా వెలుగొందుతుంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం పాన్ ఇండియా హీరోలుగా మారలేకపోతున్నారు…
Also Read : నాగచైతన్య పై సమంత కామెంట్స్ ఆగేలా లేవుగా?