Homeఎంటర్టైన్మెంట్Shah Rukh Khan Son: షాకింగ్ విషయాలు చెప్పిన షారుఖ్ కొడుకు !

Shah Rukh Khan Son: షాకింగ్ విషయాలు చెప్పిన షారుఖ్ కొడుకు !

ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకుంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్‘ కొడుకు ‘ఆర్య‌న్ ఖాన్‌’ అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్‌ కేసులో ఆర్య‌న్ ఖాన్‌ తో పాటు ఎనిమిది మందిని ఎన్‌సీబీ అధికారులు విచారించగా సంచలన నిజాలు బయట పడ్డాయి. ముఖ్యంగా కస్టడీలో ఆర్యన్‌ ఖాన్‌ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఆర్యన్‌ గత నాలుగు సంవత్సరాలుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు అధికారులకు చెప్పాడు. మొదటిసారి యూకేలో ఉన్నప్పుడు డ్రగ్స్‌ తీసుకున్నాడట.

Shah Rukh Khan Son

ఆ తర్వాత దుబాయ్‌, ఇతర దేశాల్లో చదువుకునే రోజుల్లో డ్రగ్స్ తీసుకున్నాడట. నిజంగా ఇది షాకింగే. తన కుమారుడు డ్రగ్స్ కి బానిస అయ్యాడని.. గత నాలుగేళ్లల్లో షారుక్‌ ఖాన్‌ కి తెలియలేదా ? లేక తెలిసినా పట్టించుకోలేదా ? నిజానికి గతంలో షారుఖ్ కూడా డ్రగ్స్ కి అలవాటు అయ్యాడని రూమర్స్ వచ్చాయి. కానీ డ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు బుక్ అవ్వడం విచిత్రమే.

ఇక తన కుమారుడు కస్టడీలో ఉన్నా షారుఖ్ బాధ పడటం లేదట. జీవితంలో అందరూ తప్పులు చేస్తారని.. అలాగే నా కుమారుడు తప్పులు చేశాడని.. ఆర్యన్ లో మార్పు వచ్చే సమయం త్వరలోనే వస్తోందని షారుఖ్ తన సన్నిహితులు దగ్గర చెబుతున్నాడట. ఇక పోలీసుల విచారణలో తన కుమారుడితో షారుఖ్ రెండు నిమిషాల పాటు మాట్లాడి దైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడట. అధికారుల కాళ్ళు పట్టుకుని వదిలిపెట్టమని బతిమిలాడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసే.. షారుఖ్ ఆర్యన్ తో వీడియో కాల్ మాట్లాడి.. ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ తర్వాత అధికారులు ఆర్యన్ ఫోన్‌ లో కాల్స్ డేటాను, చాట్స్‌ను పరిశీలిస్తే.. కొంతమంది యంగ్ హీరోయిన్స్ కి కూడా డ్రగ్స్ కేసులో లింక్స్ ఉన్నాయని అంటున్నారు.

నటీనటులకు డ్రగ్స్ కు అవినాభావ సంబంధం ఉందని ఇప్పటికే బలమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. ఇలా కొత్త భామలు, బుడ్డ స్టార్లు డ్రగ్స్ మత్తులో చిత్తుగా దొరికితే.. నష్టం సినిమా ఇండస్ట్రీకే. ఏది ఏమైనా సినిమా పక్షులు మాత్రం మత్తును బాగా ఇష్టపడతారు. ఆ మత్తులోనే బతకాలని ఆశ పడతారు. చివరకు ఆ మత్తునే చిత్తు అయిపోతారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper