ఆంధ్రప్రదేశ్ లో కుల చిచ్చు రేగుతోంది. కులమే ప్రధానంగా మాటల తూటాలు పేలుతున్నాయి. రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై కుల చిచ్చు ప్రారంభమైంది. దీంతో నాయకుల్లో సహనం నశించి తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో తమ మనసులోని కుళ్లును వెళ్లగక్కుతున్నారు. కాపు కులమే ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ప్రతి వాడు కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారుతోంది.
కుల చిచ్చు రాష్ర్టంలో కలకలం రేపుతోంది. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో చోటుచేసుకున్న మాటల యుద్ధం నేటికి ముగియడం లేదు. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికే పేర్ని నానిపై కాపు సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సంఘం నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదం అవుతున్నాయి.
కులం పేరు మీద ఎదగడం తరువాత కులాన్ని తిట్టడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. పుట్టిన కులాన్ని తిట్టడంతోపాటు ఎదుటి వారిపై విమర్శలు చేయడం కూడా పరిపాటిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఐకమత్యం గురించి ఎవరు ఆలోచించడం లేదు. కాపులపై వ్యాఖ్యలు చేస్తూ పేర్ని నాని వంటి వారు స్థాయి తగ్గి ప్రవర్తించడం దారుణమని పలువరు పేర్కొంటున్నారు.
కాపులు వర్సెస్ వైసీపీ గా రాజకీయాలు మారుతున్నాయి. ఇందులో వంగవీటి రాధా కాపుల తరఫున తన భావాలు వ్యక్తీకరించారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేయడం బాగా లేదని చెబుతున్నారు. కాపులను ఏకం చేసే పనికి ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో కులం కూడా ప్రధానమనే విషయం తెలిసేలా చేస్తున్నారని చెబుతున్నారు.
