https://oktelugu.com/

Shabana Azmi: గదికి వచ్చి వెళ్లి ఆ పనిచేశాడు… స్టార్ హీరో ప్రవర్తనపై హీరోయిన్ కామెంట్స్ వైరల్

Shabana Azmi: ఒకప్పుడు బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీని ఏలిన షబానా అజ్మీకి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందట. 70లలో జరిగిన ఆ విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. షబానా అజ్మీ హీరో శశి కపూర్ కి పెద్ద ఫ్యాన్ అట.

Written By:
  • S Reddy
  • , Updated On : May 28, 2024 / 05:44 PM IST

    Shabana Azmi recalls Shashi Kapoor

    Follow us on

    Shabana Azmi: హీరోయిన్ గా రాణించడం అంత సులభం కాదు. వందల మంది మధ్య పొట్టి బట్టలు ధరించాలి. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలి. డాన్సులు వేయాలి. కొన్నిసార్లు ప్రమాదకరమైన స్టంట్స్ కూడా చేయాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ ఏది చేయమంటే అది చేయాలి. స్టార్ హీరోయిన్స్ కి కొంత వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ అభ్యంతరాలను హీరోలు, దర్శకులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన హీరోయిన్స్ పట్ల దర్శక, నిర్మాతలు, హీరోలు కొంచెం కఠినంగానే వ్యహరిస్తారు.

    ఒకప్పుడు బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీని ఏలిన షబానా అజ్మీకి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందట. 70లలో జరిగిన ఆ విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. షబానా అజ్మీ హీరో శశి కపూర్ కి పెద్ద ఫ్యాన్ అట. 9 ఏళ్ల ప్రాయం నుండే ఆయన్ని ఆరాధించేదట. షబానా అజ్మీ 6వ చిత్రం ఫకీరా(Fakira). ఫస్ట్ టైం శశి కపూర్(Shashi Kapoor) తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందట.

    Also Read: Star Hero: ఇండియాలోనే ఫస్ట్… ఐటెం బాయ్ గా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

    ఆ చిత్రంలో దిల్ మే తుజే బితకర్ అనే ఓ సాంగ్ ఉండగా… ఆ రోజు చిత్రీకరించాల్సి ఉందట. కొరియోగ్రాఫర్ సత్యనారాయణ్ ఆ పాటకు స్టెప్స్ కంపోజ్ చేశాడట. శశి కపూర్ కంటే సెట్స్ కి ముందుగా వెళ్లిన షబానా అజ్మీ ఆ పాటలో స్టెప్స్ పట్ల అభ్యంతరం చెప్పిందట. బాగా సన్నిహితంగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. నేను చేయలేను అన్నారట. తన గదిలోకి వెళ్లి మేకప్ మ్యాన్ తో చెప్పి ఆమె ఏడుస్తూ కుర్చున్నారట. ఇంతలో శశి కపూర్ ఆమె గదికి వచ్చాడట.

    Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్ భారీ హిట్ కొట్టబోతున్నాడా..?

    ఏమైంది నీకు అని అడిగాడట? అలాంటి స్టెప్స్ లో నేను నటించలేను అని షబానా అన్నారట. హీరోయిన్ కావాలంటే ఇలాంటివి అన్నీ ఉంటాయని నీకు తెలియదా? తెలివి తక్కువ దానిలా ఉన్నావే… అని తిట్టి శశి కపూర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడట. ఈ నీచుడు ఇలా తిట్టిపోయాడు ఏంటని షబానా అనుకున్నారట. తీరా షూటింగ్ మొదలయ్యాక చూస్తే స్టెప్స్ మొత్తం మార్పించేశారట శశి కపూర్. దాంతో ఆయన ఔన్నత్యం అర్థమైందని షబానా ఓ సందర్భంలో గుర్తు చేసుకుంది.