Star Hero: ఇండియాలోనే ఫస్ట్… ఐటెం బాయ్ గా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

తెలుగులో తొలితరం ఐటెం భామలుగా ప్రాచుర్యం పొందారు జ్యోతిలక్ష్మి, జయమాలిని. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఐటెం గర్ల్స్ అంటే వీరే. వీరిద్దరికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

Written By: S Reddy, Updated On : May 25, 2024 3:04 pm

Do you know the star hero who was made as an item boy

Follow us on

Star Hero: ఐటెం సాంగ్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథతో సంబంధం లేకుండా ఒక మెరుపులా వచ్చి అలరించి పోతారు ఐటెం భామలు. పొట్టి బట్టల్లో కైపెక్కించే స్టెప్స్ తో ప్రేక్షకుడికి గిలిగింతలు పెడతారు. ఓ సీరియస్ కథలో ట్రావెల్ చేస్తున్న ప్రేక్షకుడికి ఐటెం సాంగ్ అనేది ఉపశమనం. దాదాపు సెకండ్ హాఫ్ లో ఐటెం సాంగ్ ఉంది. మాస్ హీరోల కమర్షియల్ చిత్రాలకు ఐటెం సాంగ్ ఉండేలా దర్శకులు చూసుకుంటారు.

తెలుగులో తొలితరం ఐటెం భామలుగా ప్రాచుర్యం పొందారు జ్యోతిలక్ష్మి, జయమాలిని. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఐటెం గర్ల్స్ అంటే వీరే. వీరిద్దరికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి తర్వాత అంతగా ప్రభావం చూపిన ఐటెం భామ సిల్క్ స్మిత. ఇక బాలీవుడ్ లో చెప్పాలంటే మలైకా అరోరా, రాకీ సావంత్, లారా దత్తా పేర్లు చెప్పుకోవాలి. పదుల సంఖ్యలో వీరు ఐటెం సాంగ్స్ చేశారు.

స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేయడం విశేషం. తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఐటెం సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామలు కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొనె, ఐశ్వర్య రాయ్ సైతం ఈ ప్రత్యేక గీతాల్లో నటించారు. తెలుగులో అభినయ, మొమైత్ ఖాన్ ప్రొఫెషనల్ ఐటెం భామలుగా పేరుగాంచారు. కొన్నాళ్లుగా నోరా ఫతేహి ప్రత్యేక గీతాలలో నటిస్తూ దేశాన్ని ఊపేస్తోంది.

చాలా మందికి తెలియని విషం ఏమిటంటే… ఐటెం గర్ల్స్ తో పాటు ఐటెం బాయ్స్ కూడా ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ బడా హీరోల పక్కన కమర్షియల్ చిత్రాలు చేస్తూనే అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ చేశారు. అలాగే స్టార్ హీరోలు కూడా ఐటెం సాంగ్స్ లో కనబడి అలరించారు. అలా కనిపించిన మొదటి ఐటెం బాయ్ షారుక్ ఖాన్. 2005లో విడుదలైన కాల్ మూవీలో షారుక్ ఖాన్ ఐటెం సాంగ్ చేయడం కొసమెరుపు. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ఈ మూవీలో షారుక్ ఖాన్-మలైకా అరోరా ఐటెం సాంగ్ లో కనిపించారు. ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ కాగా, ఆయనతో ఉన్న అనుబంధంతో షారుక్ ఐటెం నెంబర్ చేశాడు.