https://oktelugu.com/

Salman Khan: సల్మాన్ ఖాన్ భారీ హిట్ కొట్టబోతున్నాడా..?

సల్మాన్ ఖాన్ ఇంతకుముందు చేసిన సినిమాల కంటే కూడా ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా చేయాలని అనుకుంటున్నాడు. అందువల్లే మురుగదాస్ మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 27, 2024 / 10:14 AM IST

    Is Salman Khan going to make a big hit

    Follow us on

    Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలనే తపనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈమధ్య బాలీవుడ్ హీరోలు ఎవరూ కూడా సక్సెస్ సినిమాలను చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ సినిమాతో అయినా తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోవాలనే ధృడ సంకల్పంతో సల్మాన్ ఖాన్ ఉన్నట్టు గా తెలుస్తుంది.

    అయితే సల్మాన్ ఖాన్ ఇంతకుముందు చేసిన సినిమాల కంటే కూడా ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా చేయాలని అనుకుంటున్నాడు. అందువల్లే మురుగదాస్ మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ వచ్చినట్టయితే సల్మాన్ ఖాన్ మురుగ దాస్ ఇద్దరికీ కూడా చాలావరకు ఈ సినిమా ప్లస్ అవుతుందనే చెప్పాలి.

    ఇక ఇద్దరూ వాళ్ల వాళ్ల కెరియర్ లో మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమాగా ఈ సినిమా మిగిలిపోతుంది. కాబట్టి మురుగదాస్ ఈ సినిమా కోసం రాత్రి పగలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా ఈ సినిమా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి సల్మాన్ ఖాన్ ఒకప్పుడు వరుస సక్సెస్ లను అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేసిన సినిమాలు ఏవి సరిగ్గా ఆడకపోవడం వల్ల ఆయన చాలావరకు బాధలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక దానికి తోడు మన స్టార్ హీరోలందరూ బాలీవుడ్ లో చక్రం తిప్పడంతో వాళ్లందరికీ ఆ విషయం చాలా ఇబ్బందిగా మారింది. అందువల్లే వాళ్ళు ఎలాగైనా సక్సెస్ లు కొట్టాలని ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇంతకు ముందు మురుగ దాస్ బాలీవుడ్ లో గజిని సినిమాను రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాడు. చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు మంచి సక్సెస్ ను కొడతారో లేదో…