https://oktelugu.com/

Rahul Sipligunj: రతికతో బ్రేకప్ గురించి రాహుల్ సిప్లిగంజ్ బయటపెట్టిన సంచలన నిజాలు

రతిక ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా తన మాజీ బాయ్ ఫ్రెండ్ అదేనండి రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రస్తావన తీసుకు వచ్చేది. ఇక ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడే వీరిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 10, 2023 / 01:35 PM IST

    Rahul Sipligunj

    Follow us on

    Rahul Sipligunj: రతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చి మరింత ఫ్యాన్ బేస్ సంపాదించింది. అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పులిహోర కలపడం, సమయం వచ్చినప్పుడల్లా తన మాజీ లవర్ గురించి ప్రస్తావించడం చాలా పాపులారిటీని సంపాదించింది. ఊహించని విధంగా ఎలిమినేట్ అయినా రతిక మళ్లీ తిరిగి ఎంట్రీ కూడా ఇచ్చింది.

    రతిక ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా తన మాజీ బాయ్ ఫ్రెండ్ అదేనండి రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రస్తావన తీసుకు వచ్చేది. ఇక ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడే వీరిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీనిపై రాహుల్ పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ కు హాజరైన రాహుల్ రతికతో బ్రేకప్ గురించి మొదటి సారి స్పందించాడు. మరి ఆ వివరాలు మీకోసం..

    ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆమెతో పాటు హౌజ్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కు నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బాగా ఆడి కప్పుతో బయటకు రావాలని కోరుకుంటున్నాను. విన్నర్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి మాత్రం భోలె షావళి మంచి వినోదాన్ని అందిస్తున్నారు అంటూ తెలిపాడు రాహుల్. అంతే కాదు శివాజీ ఇంట్లో పెద్దవ్యక్తిలా ఉన్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన ప్రశాంత్ ఒకప్పుడు బిగ్ బాస్ షోను ప్రేక్షకుడిలా చూశాడు. ఇప్పుడు ఆయనను ప్రేక్షకులు హౌజ్ లో చూస్తున్నారు అని కొనియాడాడు. ఇలా కొందరి గురించి రాహుల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే రతిక గురించి ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం, భవిష్యత్తు ఉంటుంది అనడంలో అంతరార్థం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అంటే భవిష్యత్తు గురించి తెలియక గతంలో ప్రేమించావా రాహుల్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.