Kamal Haasan- Sarika: ఆ హీరోయిన్ వల్లనే కమలహాసన్ సారిక విడిపోయారా..?అసలేం జరిగింది..?

ఈయనకి తెలుగు లో కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంది.ఇక అందులో భాగంగానే ఆయన వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు.ఇక డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఆయన దిట్ట... అయితే కమలహాసన్ తనతో పాటు నటించే నటి అయిన సారికాని ప్రేమించారు ఆమె కూడా కమల్ ని ప్రేమించింది.

Written By: Gopi, Updated On : November 10, 2023 1:37 pm

Kamal Haasan- Sarika

Follow us on

Kamal Haasan- Sarika: ఇండియా లో ఏ పాత్రలో లో అయిన అలవొక గా నటించి మెప్పించే సత్తా కొంతమంది నటులకి మాత్రమే ఉంటుంది. అందులో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన కమలహాసన్ ఒకరు.లోక నాయకుడిగా ఈయన చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

ఈయనకి తెలుగు లో కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంది.ఇక అందులో భాగంగానే ఆయన వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు.ఇక డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఆయన దిట్ట… అయితే కమలహాసన్ తనతో పాటు నటించే నటి అయిన సారికాని ప్రేమించారు ఆమె కూడా కమల్ ని ప్రేమించింది. దాంతో కమల్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మరి సారికను పెళ్లి చేసుకొన్నాడు. ఇక అందులో భాగంగానే సారికకు శ్రుతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.ఇక ఇది ఇలా ఉంటే కమలహాసన్ తన సినిమాల్లో తనకి జోడిగా నటించిన నటి గౌతమి తో ఎక్కువ సినిమాలు చేసేవాడు.

ఆ సమయంలోనే వాళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి చాలా రోజులు ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.ఇక వీళ్ళ విషయం తెలిశాక గౌతమిని కలవద్దు అని సారిక కమలహాసన్ కి ఎంత చెప్పినా వినక పోవడం తో అప్పటి నుంచి సారిక నే కమలహాసన్ కి దూరంగా ఉంటూ వచ్చింది.ఇక దాంతో కమలహాసన్ గౌతమికి చాలా దగ్గర అయి తనతోనే ఉండేవాడు… ఇక 2004వ సంవత్సరంలో సారిక కమలహాసన్ కి విడాకులు ఇవ్వడం జరిగింది.ఇక అప్పటి నుంచి కమలహాసన్ గౌతమితోనే కలిసి ఉంటున్నాడు. అయితే రీసెంట్ గా వీళ్ళిద్దరి మధ్య కూడా బ్రేకప్ అయినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.ఎందుకు గొడవలు జరిగాయి అనే విషయం మీద పూర్తి క్లారిటీ లేనప్పటికీ వీళ్లిద్దరి మధ్య కొన్ని గొడవలు రావడంతో వీళ్లిద్దరూ దూరంగా ఉంటున్నట్టు గా తెలుస్తుంది…

ఇక ఇదే క్రమం లో కమలహాసన్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా గడుపుతున్నాడు. ఇక వీళ్ళ వ్యవహారం చూసిన చాలా మంది జనాలు సారికతో కమలహాసన్ కి విడాకులు ఇప్పిస్తే నీకు కూడా కమలహాసన్ దక్కలేదు విధి అంటే ఇలానే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు…ఇక గౌతమి ఇప్పుడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇక ఇప్పటి వరకు కమలహాసన్ కూడా ఒంటరి గానే ఉంటూ సినిమాలు చేస్తున్నాడు ఇక ఇప్పుడు కమలహాసన్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న భారతీయుడు 2 సినిమాతో పాటు గా, ప్రభాస్ కల్కి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు…