https://oktelugu.com/

Devara Movie : దేవర 2′ గురించి అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్..షూటింగ్ ప్రారంభం తేదీ ఖరారు!

'దేవర' క్లైమాక్స్ లో వర దేవర ని చంపినట్టు చూపించడం, ఎదో బాహుబలి సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేసినట్టుగా అనిపించింది అంటూ ఈ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు. సీక్వెల్ వచ్చే సమస్యే లేదు, ఎన్టీఆర్ ఒప్పుకోడు అని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిసిన కొరటాల శివ(Director Koratala Siva), దేవర సీక్వెల్(Devara Part2) కోసం ఒప్పించినట్టు తెలుస్తుంది.

Written By: , Updated On : February 19, 2025 / 09:27 PM IST
Devara Movie

Devara Movie

Follow us on

Devara Movie : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్(Junior NTR) ‘దేవర'(Devara Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘అరవింద సమేత’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి విడుదలైన సోలో హీరో చిత్రమిది. మధ్యలో #RRR వచ్చి గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించినప్పటికీ, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి చెందింది దేవర కి మాత్రమే. తమ అభిమాన హీరో ని ఎలా అయితే చూడాలని అభిమానులు కోరుకున్నారో, అలా చూపించడం లో డైరెక్టర్ కొరటాల శివ సక్సెస్ అయ్యాడు కానీ, సీక్వెల్ తీసేంత కంటెంట్ ఈ చిత్రంలో లేదని అభిమానులు సైతం అనేక సందర్భాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఎందుకంటే ఈ సినిమా ఆడింది కేవలం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ఆ తర్వాత ఎన్టీఆర్ నటన వల్ల. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఎవ్వరూ ఆసక్తి చూపించరు అనేది అభిమానుల వాదన.

‘దేవర’ క్లైమాక్స్ లో వర దేవర ని చంపినట్టు చూపించడం, ఎదో బాహుబలి సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేసినట్టుగా అనిపించింది అంటూ ఈ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు. సీక్వెల్ వచ్చే సమస్యే లేదు, ఎన్టీఆర్ ఒప్పుకోడు అని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిసిన కొరటాల శివ(Director Koratala Siva), దేవర సీక్వెల్(Devara Part2) కోసం ఒప్పించినట్టు తెలుస్తుంది. కొరటాల శివ సీక్వెల్ కోసం డెవలప్ చేసిన ఐడియా ఎన్టీఆర్ కి చాలా బాగా నచ్చిందట అందుకే ఈ ఏడాది జులై నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పెట్టుకుందామని కొరటాల తో చెప్పాడట ఎన్టీఆర్. దీంతో ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి సన్నాహాలు మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడట. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు.

ఇది ఇలా ఉండగా రేపటి నుండి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ‘వార్ 2’ మూవీ సెట్స్ లో ఉన్న ఎన్టీఆర్, కొన్ని రోజుల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లోకి రాబోతున్నాడట. ప్రశాంత్ నీల్ చిత్రం, అదే విధంగా దేవర సీక్వెల్ రెండిటిని సమాంతరం గా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. వార్ 2 చిత్రం ఆగస్టు నెలలో విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఇప్పుడు వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ లో విడుదల కాబోతుందట. అదే విధంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. చూడాలి మరి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది.