Devara Movie Promotion in Japan
Devara Movie : మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్(Junior NTR) నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర'(Devara Movie) గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #RRR తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమా కావడంతో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. ఫలితంగా ఓపెనింగ్స్ దగ్గర నుండి, క్లోజింగ్ వరకు కనీవినీ ఎరుగని రేంజ్ లో వసూళ్లను రాబట్టి, బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మర్కెట్స్ లో అయితే ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు బయ్యర్స్ నిజంగా ఒక సర్ప్రైజ్ అనొచ్చు. ఓటీటీ లో అయితే గత నెల వరకు ట్రెండింగ్ లోనే ఉన్నింది. ఇలా బిజినెస్ పరంగా అన్ని మోడల్స్ లోనూ లాభాల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు విదేశీ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతుంది.
ఎన్టీఆర్ కి మొదటి నుండి జపాన్(Japan) లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. #RRR కి ముందు ఆయన సినిమాలు కొన్ని ఆ దేశం లో దుమ్ము దులిపేసాయి. అప్పటి నుండి జపనీస్ కి ఎన్టీఆర్ ముఖం పరిచయమే. #RRR తర్వాత ఆయన రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం ‘దేవర’ చిత్రాన్ని జపాన్ భాషలోకి డబ్ చేసి వచ్చే నెల 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అందుకోసం ఎన్టీఆర్ ఇప్పటి నుండే ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. జపాన్ లో పలు ముఖ్యమైన మీడియా చానెల్స్ కి ఆయన ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేసాడు. త్వరలోనే ఆయన జపాన్ కి స్వయంగా వెళ్లి ప్రమోషన్ చేసే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నట్టు సమాచారం.
#RRR చిత్రం జపాన్ లో అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రొమోషన్స్. మూవీ టీం జపాన్ కి వెళ్లి దాదాపుగా నెల రోజుల వరకు ప్రొమోషన్స్ చేసారు. జపాన్ జనాలకు బాగా అలవాటు అయిపోయింది ఈ చిత్రం అందుకే, బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టింది. ‘దేవర’ కి కూడా అదే మోడల్ ని అనుసరించబోతున్నారు. అయితే #RRR తర్వాత రామ్ చరణ్ హీరో గా నటించిన ‘రంగస్థలం’ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేయగా, ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్స్ అయితే ఆల్ టైం నెంబర్ 1 స్థానంలో నిల్చింది. ‘దేవర’ కూడా ఆ రేంజ్ కి చేరుకుంటుందో లేదో చూడాలి. మ్యూజిక్ పరంగా దేవర పెద్ద బ్లాక్ బస్టర్, జపాన్ దేశం వాళ్ళు మ్యూజిక్ ఉన్న సినిమాలకు బాగా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.