https://oktelugu.com/

Bigg Boss 8 Telugu : డబ్బిస్తే బిగ్ బాస్ లోకి ఎంట్రీ? ఇందులో నిజమెంత? ఆది రెడ్డి చేసిన సంచలన కామెంట్లు

బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్ లోకి వెళ్లే వరకు జరిగిన వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, రెమ్యూనరేషన్ వంటి విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా తనకు బిగ్ బాస్ సీజన్ ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పారితోషకం అందిందని తెలిపారు

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2024 / 04:19 PM IST

    Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ వాస్.. ఇక కొన్ని రోజుల్లోనే ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపించబోతుంది. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో బిగ్ బాస్ గురించి వీడియోలు, రివ్యూలు వస్తుంటాయి. ఎందుకంటే బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు మళ్లీ వస్తున్నాడు బిగ్ బాస్ . ఇప్పటికే ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. ఇటీవలే ఈ షోకు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. మేకర్స్ శనివారం (ఆగస్టు 03) బిగ్ బాస్ లేటెస్ట్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు ఈ షోలో పాల్గనబోయే కంటెస్టెంట్ ల వివరాలు ఇవే అంటూ చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత అనేది షో ప్రారంభంలోనే తెలుస్తుంది. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం పేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది అన్నమాట.

    ఈ షోకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో బిగ్ బాస్ సెట్ వర్క్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ఎంపిక మీద కూడా తీవ్ర కసరత్తు జరుగుతోంది అని సమాచారం. కాగా బిగ్ బాస్ పేరిట గతంలో పలు మోసాలు వెలుగు చూసాయి అంటూ చాలా వార్తలు వచ్చాయి. హౌస్ లోకి పంపిస్తామని డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు ఉన్నారట. వీరి విషయంలో గత సీజన్ ప్రారంభంలో కూడా చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఇదే విషయంపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, రివ్యూవర్ ఆది రెడ్డి చేసిన సంచలన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    ఈ సమయంలో ఎవరూ ఈ ట్రాప్ లో పడొద్దని హెచ్చరిస్తున్నాడు ఆది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆది రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ షోస్ పై రివ్యూలు, విశ్లేషణలు అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ షోకంటే ముందు కూడా రివ్యూలు ఇచ్చారు ఆది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీడియోలు కూడా ప్రారంభించాడు. అందులో భాగంగా బిగ్ బాస్ పేరిట బయట జరుగుతున్న మోసాల గురించి తెలుపుతూ ఓ వీడియోను చేశారు. దీన్ని షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది.

    బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్ లోకి వెళ్లే వరకు జరిగిన వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, రెమ్యూనరేషన్ వంటి విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా తనకు బిగ్ బాస్ సీజన్ ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పారితోషకం అందిందని తెలిపారు ఈ బిగ్ బాస్ ప్రీవియస్ కంటెస్టెంట్. అయితే ఆయన మాట్లాడుతూ.. బిగ్ బాస్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడని.. మీకు బిగ్ బాస్ కి రావడం ఆసక్తి ఉందా అంటూ అడిగారట. ఆది ఒకే చెప్పిన తర్వాత అధికారిక వెబ్ సైట్ నుంచి మెయిల్ పంపి కొన్ని వివరాలు అడిగారట.

    తర్వాత తనకు జూమ్ కాల్ నుంచి ఇంటర్వ్యూ జరిగింది. తర్వాత రెమ్యూనరేషన్ గురించి వివరంచారట. హెల్చ్ చెకప్స్, తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కు హాజరయ్యారట. ఏవీలు, డ్యాన్స్ షూట్స్ అన్నీ అయిన తర్వాత ఇంట్లోకి పంపిస్తారట మేకర్స్. ప్రముఖులు సిఫారసులు, రికమెండేషన్ లు బిగ్ బాస్ కు పని చేయవని.. ఎవరైనా బిగ్ బాస్ లోకి పంపుతామని డబ్బులు అడిగినా కూడా ఆ ట్రాప్ లో వెళ్లవద్దు అంటున్నారు ఆది . ఆఫర్ ఇచ్చే పనైతే వాళ్లే కాల్ చేస్తారని.. అధికారిక మెయిల్ ఐడీ నుంచి మెయిల్ కూడా వస్తుందని తెలిపారు. ఈ ప్రాసెస్ జరగకుండా బిగ్ బాస్ లోకి వెళ్లడం సాధ్యం కాదట. సో జాగ్రత్త సెలబ్రెటీలు..