Train horns : భారతదేశంలో అతిపెద్ద రవాణా సాధనం రైలు మార్గం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం నలుమూలలా రైలు మార్గం ఉంది. తక్కువ ధరలో సుదూరం ప్రయాణించాలంటే రైలు మార్గం ఒక్కటే సరైనది అని చాలా మంది భావిస్తారు. దేశంలో మొత్తం రైలు మార్గాలు 2022 నాటికి 63,140 కిలోమీటర్లు విస్తరించి ఉంది. రైల్వే వ్యవస్థలో మొత్తం 2,16,717 వ్యాగన్లు, 39,263 కోచ్ లు, 7,739 ఇంజిన్లు ఉన్నాయి. 1853లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే వ్యవస్థ 1947 స్వాతంత్య్రం వచ్చిన నాటికి 42 విభాగాలుగా విడిపోయింది. ఆ తరువాత 1951లో అన్నీ సంస్థలు కలుపుకొని ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల సరసన భారత్ చేరింది. భారత రైళ్లలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో రెగ్యులర్ ఉద్యోగులు, విహార యాత్రకు వెళ్లే వారు ఉంటారు. మిగతా ప్రయాణాల ఖర్చు కంటే రైల్వేలో ప్రయాణం చాల చౌక. అందుకే రైల్వే వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. రైలులో ప్రయాణం చేయాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే రైలులో ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్ కు సంబంధించిన కొన్ని విషయాలను ముందుగా తెలుసుకుంటే మంచిది.వీటిలో ముఖ్యంగా రైలు హారన్ గురించి అందరికీ తెలిసిందే. ట్రైన్ హార్న్ ఇస్తుందంటే ఆ రైలు ప్రయాణానికి సిద్ధంగా ఉందని అర్థం. అయితే ఒక్కసారి ట్రైన్ హార్న్ విభిన్నంగా ఉంటుంది. ఒక్కోసారి మూడు సార్లు, మరికొన్ని సార్లు సింగిల్ హార్న్ వినిపిస్తుంది. ఇలా రావడానికి కారణమేంటి? ఇలాంటి హార్న్ ఎందుకు ఇస్తారు? వివరాలు తెలుసుకోవాలంటే కిందికి వెళ్లండి..
సాధారణంగా ఇతర వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు ఎదురుగా ఉన్న వాహనాలు, లేదా ట్రాఫిక్ క్లియర్ కావడానికి హార్న్ ఇస్తుంటాయి. ఇవి ఒక్కో వాహనానికి ఒక్కో విధంగా ఉంటాయి. కానీ అన్నీ ట్రైన్లకు ఒకే రకమైన హార్న్ సౌండ్ ఉంటుంది. అయితే కొన్ని సార్లు డిఫరెంట్ గా హార్న్ వస్తుంది. ఒక ట్రైన్ హార్న్ వచ్చింది అంటే అది ఉన్న పరిస్థితిని తెలుపుతుంది. సింగిల్ నుంచి నాన్ స్టాప్ హార్న్ ను ట్రైన్ నడిపే లోకో పైలట్ ఇస్తారు. ఇలా ఎందుకు ఇస్తారంటే?
ఒక ట్రైన్ నుంచి ఒకే ఒక్క షార్ట్ హార్న్ వస్తుందంటే.. ఆరైలు వాషింగ్ కు వెళ్తుందని అర్థం. అంటే ఆ ట్రైన్ ఇప్పుడు ప్రయాణానికి సిద్ధంగా లేదని తెలుసుకోవాలి.
ఒక రైలు నుంచి రెండు షార్ట్ హారన్లు వస్తున్నాయంటే ఒక స్టేషన్ నుంచి ఆ ట్రైన్ స్టార్ట్ అవుతుందని తెలుసుకోవాలి. ఈ విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలుపుతుంది.
ఒక ట్రైన్ లో లోకో ఫైలట్ రెండు లాంగ్ హారన్లు, ఒక షార్ట్ హర్న్ ఇస్తున్నాడంటే ఆ ట్రైన్ లో ఎవరో చైన్ లాగారని తెలుపుతన్నట్లు అర్థం. అంటే ఏదో విషయంలో చైన్ లాగడం వల్ల ట్రైన్ ఆగే అవకాశం ఉందని తెలుపుతుంది.
ఒక ట్రైన్ లోని లోకో ఫైలట్ మూడు షార్ట్ హార్న్ ఇస్తున్నారంటే ఆ ట్రైన్ తన కంట్రోల్ తప్పినట్లు తెలుసుకోవాలి.
ఇక నాలుగు షార్ట్ హార్న్ ఇస్తున్నారంటే అందులో ఏదో సాంకేతిక సమస్య ఉందని తెలుసుకోవాలి.
ఆపకుండా ఆరు చిన్న హారన్లు వచ్చాయంటే ఆ రైలు ఏదో ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోవాలి.
ఒక ట్రైన్ ఏదైనా స్టేషన్ కు వచ్చే ట్రైన్ నుంచి నాన్ స్టాప్ ఘా హార్న్ వస్తుందంటే ఆ ట్రైన్ ఆ స్టేషన్లో ఆగదు అని అర్థం. దీంతో ట్రైన్ కోసం ఎదురుచూసేవాళ్లు తమకు సంబంధించిన రైలు కాదని గుర్తించాలి