https://oktelugu.com/

Rajeev Kanakala: వాళ్ళ కారణంగానే సుమకు షోలు తగ్గిపోయాయి… భర్త రాజీవ్ సెన్సేషనల్ కామెంట్స్

కొన్నాళ్లుగా ఆమె జోరు తగ్గింది. సుమ గతంలో మాదిరి ఎక్కువ షోలు చేయడం లేదు. ప్రస్తుతం సుమ యాంకరింగ్ చేస్తున్న ఒకే ఒక షో సుమ అడ్డా. కాగా సుమకు ఆఫర్స్ తగ్గడం వెనుక కారణం ఏమిటో ఆమె భర్త రాజీవ్ కనకాల వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ... సుమ నా జీవితంలోకి వచ్చాక ఆర్థికంగా, మానసికంగా స్ట్రాంగ్ అయ్యాను.

Written By:
  • S Reddy
  • , Updated On : February 6, 2024 / 10:20 AM IST

    Rajeev Kanakala

    Follow us on

    Rajeev Kanakala: యాంకర్ సుమ బుల్లితెర వేదికగా చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆమె రికార్డ్స్ మరొక యాంకర్ చేరుకోలేనివి. రెండు దశాబ్దాలకు పైగా ఆమె ప్రస్థానం కొనసాగుతుంది. వాక్చాతుర్యం, తెలుగు భాషపై పట్టు, సమయస్ఫూర్తి ఆమెను స్టార్ యాంకర్ చేశాయి. యాంకర్స్ లో సుమ చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు. ప్రముఖ ఛానల్స్ లో పలు షోలకు తీరిక లేకుండా ఆమె యాంకర్ గా వ్యవహరించారు. పాడుతా తీయగా, స్టార్ మహిళ వంటి సక్సెస్ఫుల్ షోలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

    అయితే కొన్నాళ్లుగా ఆమె జోరు తగ్గింది. సుమ గతంలో మాదిరి ఎక్కువ షోలు చేయడం లేదు. ప్రస్తుతం సుమ యాంకరింగ్ చేస్తున్న ఒకే ఒక షో సుమ అడ్డా. కాగా సుమకు ఆఫర్స్ తగ్గడం వెనుక కారణం ఏమిటో ఆమె భర్త రాజీవ్ కనకాల వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ… సుమ నా జీవితంలోకి వచ్చాక ఆర్థికంగా, మానసికంగా స్ట్రాంగ్ అయ్యాను. నాన్న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారు. ఆ దుర్భర స్థితి నుండి ఆస్తులు సంపాదించే స్థాయికి వచ్చాము. నాన్న చేసిన అప్పులు తీర్చడంలో సుమ కష్టం ఎంతో ఉంది.

    సుమ ఎంత బిజీగా ఉన్నా పిల్లలను నిర్లక్ష్యం చేయదు. వాళ్లకు సమయం కేటాయిస్తుంది. సాయంత్రం ఆరు గంటలకే ఇంటికి చేరుకుంటుంది. షూటింగ్ ఆలస్యం అయ్యేలా ఉంటే వాళ్ళను వెంటబెట్టుకుని వెళ్ళేది. వాళ్లకు ఒంటరి వాళ్ళం అనే భావన కలగకుండా చేసింది. సుమకు షోకు తగ్గడానికి పిల్లలే కారణం. వారితో కలిసి సుమ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అందులో షోలు చేస్తున్నారు. మాది గవర్నమెంట్ జాబ్ కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము… అని అన్నారు.

    రాజీవ్ కనకాల-సుమ ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమ హైదరాబాద్ లో స్థిరపడిన మలయాళీ అమ్మాయి. పరిశ్రమలో నటిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాజీవ్ తో పరిచయం ఏర్పడింది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేశారు. బబుల్ గమ్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో రోషన్ హీరోగా చేశాడు. బబుల్ గమ్ చిత్రానికి భారీ ప్రచారం దక్కింది. అయితే ఆశించిన స్థాయిలో ఆడలేదు.