Free Electricity: త్వరలో ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్.. దీని కోసం సర్కార్ ఏం చేస్తుందంటే?

200 యూనిట్ల వరకు నెలనెలా విద్యుత్‌ వినియోగించడంతోపాటు పేదరికంలో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. ఈమేరు ఫిబ్రవరి6 నుంచి సర్వే చేపట్టనున్నారు.

Written By: Raj Shekar, Updated On : February 6, 2024 10:09 am
Follow us on

Free Electricity: తెలంగాణలో మరో రెండు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గృహజ్యోతి.. సబ్సిడీ సిలిండర్లు అందించేందుకు ఆదివారం క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపింది. గృహజ్యోతిలో భాగంగా అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించడంతోపాటు, తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందించాలని నిర్ణయించింది.

లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే..
ఈ క్రమంలో లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా గృహజ్యోతి పథకం అబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. దీంతో జిల్లాల వారీగా సర్వే చేపట్టేందుకు విద్యుత్‌శాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు.

నేటి నుంచి సర్వే..
200 యూనిట్ల వరకు నెలనెలా విద్యుత్‌ వినియోగించడంతోపాటు పేదరికంలో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. ఈమేరు ఫిబ్రవరి6 నుంచి సర్వే చేపట్టనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహవినియోగ విద్యుత్‌ మీటర్‌ ప్రస్తుత వినియోగం బిల్, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ ఆనుసంధానం చేయనున్నారు. ఈమేరకు విద్యుత్‌ శాఖ అధికారులతో సోమవారం సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.