https://oktelugu.com/

Ben Stokes: ఆ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్

ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన 'బెన్ స్టోక్స్' మాట్లాడుతూ సెకండ్ ఇన్నింగ్స్ లో వాళ్ల ప్లేయర్ అయిన 'క్రాలీ ' కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యు అయినప్పుడు కుల్దీప్ యాదవ్ తీసుకున్న డిఆర్ఎస్ సరిగ్గా చూపించలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : February 6, 2024 10:22 am
    Ben Stokes questions DRS over Crawley lbw dismissal
    Follow us on

    Ben Stokes: ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండోవ టెస్టులో ఇండియా భారీ విజయాన్ని సాధించింది. ఇక మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఎలాంటి విజయాన్ని అయితే నమోదు చేసుకుందో రెండో మ్యాచ్ లో ఇండియా దానికి రివేంజ్ తీర్చుకున్నట్టు గా ఆడి ఒక భారీ విక్టరీ కొట్టింది. ఇక ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన ‘బెన్ స్టోక్స్’ మాట్లాడుతూ సెకండ్ ఇన్నింగ్స్ లో వాళ్ల ప్లేయర్ అయిన ‘క్రాలీ ‘ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యు అయినప్పుడు కుల్దీప్ యాదవ్ తీసుకున్న డిఆర్ఎస్ సరిగ్గా చూపించలేదు.

    బాల్ లెగ్ స్టంప్ ను దాటి వెళ్లిపోయేలా ఉంటే, ట్రాకర్ మాత్రం స్టంప్ ను తాకినట్టుగా చూపించింది. టెక్నాలజీ పై పూర్తి నమ్మకం లేకపోవడం వల్లే ఎంపైర్ కాల్ తీసుకున్నామంటూ తెలియజేశాడు. అలాగే కొన్ని సందర్భాల్లో 100% పక్కగా చెప్పలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆ నిర్ణయం వల్లే మేము ఓడిపోయామని చెప్పను, కానీ ఇలాంటి మిస్టేక్స్ ఉంటే మ్యాచ్ ఆడేటప్పుడు ప్లేయర్ల మీద మానసికమైన ఒత్తిడి పెరుగుతుందని చెప్పడానికే ఈ విషయం గురించి మాట్లాడాను అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

    మొత్తానికైతే బెన్ స్టోక్స్ డిఆర్ఎస్ నిర్ణయం పట్ల సంతృప్తిగా లేనట్టుగా తెలియజేశాడు. ఇక ఇది ఇలా ఉంటే మూడోవ టెస్ట్ మ్యాచ్ ఈనెల 15వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లు కూడా ఆ మ్యాచ్ కోసం కసరత్తులు మొదలు పెట్టాయి. ఇక ఇప్పటికే రెండు టీంలు 1-1 తో సమంగా నిలవగా మిగిలిన మూడు మ్యాచ్ ల్లో ఎవరైతే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తారో వాళ్లే సిరీస్ ని కైవసం చేసుకుంటారు.

    ఇక బిసిసిఐ మిగిలిన మూడు మ్యాచ్ లకు ఆడబోయే ఇండియన్ టీమ్ ప్లేయర్లను ఈ రోజు అనౌన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇండియా మిగిలిన మ్యాచ్ ల మీద కూడా తమ పట్టు చూపించాలని చూస్తుంది. చూడాలి మరి ఇండియా ఈ సిరీస్ ను సాధిస్తుందా లేదా అనేది…