Allu Arjun : ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసిలాట ఘటన పై నేడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అల్లు అర్జున్ పై ఆయన దారుణమైన ఆరోపణలు చేసాడు. అసెంబ్లీ సాక్షిగా, హై కోర్టు లో కేసు నడుస్తున్న ఒక వ్యవహారం పై, ఇంతటి వ్యాఖ్యలు చేయడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మింగుడు పడడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ ని టార్గెట్ చేశాడా?, ఆయన చెప్పిన మాటల్లో నిజం ఎంత అనేది పక్కన పెడితే, అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్స్ చూస్తే, అల్లు అర్జున్ ని కేవలం రాజకీయాల కోసం ఉపయోగించుకున్నట్టు అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒవైసి మాట్లాడుతూ ‘ఇలా మీ సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఒక మహిళ చనిపోయింది అని పోలీసులు అల్లు అర్జున్ కి చెప్తే, అల్లు అర్జున్ అవునా, అయితే నా సినిమా సూపర్ హిట్ అని అన్నాడని పోలీసులు చెప్పారు’ అంటూ వ్యాఖ్యానించాడు.
ప్రపంచం లో ఏ మనిషి అయినా ఇలా చెప్తాడా?, అది కూడా పోలీసులతో?, నమ్మడానికి కాస్త అయిన రియాలిటీ గా అనిపించాలి అంటూ అల్లు అర్జున్ పై ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పై, ఒవైసి పై మండిపడ్డారు నెటిజెన్స్. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను నెటిజెన్స్ నమ్మారు..అల్లు అర్జున్ ని అసలు నువ్వు మనిషివేనా అంటూ ఇష్టమొచ్చినట్టు తిట్టారు, కానీ ఒవైసీ చేసిన ఆరోపణలు చూసాక, వీళ్లిద్దరు డైవర్షన్ పాలిటిక్స్ కోసం అల్లు అర్జున్ ని వాడుకుంటున్నారు అనేది స్పష్టమైంది. ఎందుకు డైవెర్షన్ పాలిటిక్స్ అంటే, సభ లో ప్రజా సమస్యలను ప్రతిపక్షం లేవదీస్తూ హైలైట్ చేస్తుంటే, ఎక్కడ తమ తప్పిదాలు జనాలకు తెలుస్తాయి అనే భయంతో రేవంత్ రెడ్డి స్టీరింగ్ అల్లు అర్జున్ వైపు తిప్పడంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం చేసిన పొరపాట్లు వల్ల ఇప్పటి వరకు ఎవ్వరూ చనిపోలేదా?, గోదావరి పుష్కరాల సమయంలో ఎంతో మంది చనిపోయారు. సరైన ఏర్పాట్లు చేయలేకపోయిన సీఎం చంద్రబాబు పై ఎవరైనా ఇలాంటి రియాక్షన్ ఇచ్చారా..?, ఒక స్టార్ సెలబ్రిటీ థియేటర్ కి వస్తున్నాడంటే, పోలీసులు సరైన భద్రతా కలిపించడం విఫలం అయ్యారని ఎందుకు ఎవ్వరూ విమర్శించడం లేదు, ఎందుకు ప్రభుత్వ అధికారులందరూ అల్లు అర్జున్ ఒక్కటే తప్పు చేసినట్టు చూపిస్తున్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన హీరోలలో ఒకడు అల్లు అర్జున్. నేడు బాలీవుడ్ లో జెండా పాతి, తెలుగోడి సత్తా ని మరోసారి నిరూపించిన వారిలో అల్లు అర్జున్ పాత్ర అత్యంత కీలకం. అలాంటి వ్యక్తి ని కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఉపయోగించుకొని, అతని కెరీర్ ని నాశనం చేయాలనుకోవడం అన్యాయం అంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.