Film industry : తెలుగులో చాలా మంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు.. ఇక ఇలాంటి సందర్భంలోనే పుష్ప 2 సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సాధించింది…ఇక ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి టాప్ గ్రాఫర్ గా నిలుస్తూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే… ఇక దాంతో అల్లు అర్జున్ మీద కేసు అయితే ఫైల్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే గత వారం రోజుల క్రితం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఒకరోజు మొత్తం స్టేషన్ లోనే పెట్టిన విషయం మనకు తెలిసిందే…హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పైన విపరీతంగా ఫైర్ అయ్యాడు. ఆయన సిఎం పదవిలో ఉన్నన్ని రోజులు ఒక్క సినిమాకి కూడా బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇచ్చేది లేదని టికెట్ రేటు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వబోనని తెలియజేశాడు. మరి మొత్తానికైతే ఆయన సినిమా ఇండస్ట్రీ మీద నెగిటివ్ గా స్పందిస్తున్నారు అంటూ కొంతమంది భావిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం సినిమా కోసం ప్రాణాలను తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకోసమే సీఎం గారు ఇలాంట కఠిన చర్యలు తీసుకుంటున్నారు అంటూ మాట్లాడుతున్నారు. ఇక అందులో ఏ మాత్రం తప్పైతే లేదు అంటూ అతనికి సపోర్ట్ చేస్తూ మరి కొంత మంది మాట్లాడుతున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ జైలుకు పోయి వచ్చిన తర్వాత అతనికి కాలు తిరిగిందా? కన్ను పోయిందా? చేయి విరిగిందా? కిడ్నీలు పాడైపోయాయా? ఎందుకోసమని అతన్ని అందరూ వచ్చి పరామర్శిస్తున్నారు. అతను ఒక్కరోజు జైల్లో ఉన్నందుకు నన్ను దూషిస్తూ అతని పరామర్శించడం ఎందుకు…శ్రీ తేజ్ అనే పిల్లవాడు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతని కోసం ఒక్కరోజన్నా ఎవరైనా వెళ్లి అతన్ని కలిసారా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు.
మరి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి చాలా మంచి సన్నిహితుడు చిరంజీవి లాంటి వ్యక్తితో కూడా అతనికి సత్సంబంధాలైతే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీ పైన ఆయన ఎందుకంత మొండి వైఖరిని పాటిస్తున్నాడనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ తెలంగాణ సీఎం అని సంబోధిస్తూ రేవంత్ రెడ్డి అనే పేరును మర్చిపోయాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా గుర్తుంచుకోలేదు అంటే రేవంత్ రెడ్డి ఎవరికి తెలియదనా లేదంటే కావాలనే ఆయన అలా మర్చిపోయారా?
ఇక ఆ విషయంలోనే రేవంత్ రెడ్డి చాలావరకు కోపానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దాన్ని ఉద్దేశించే సీఎం పేరు గుర్తు రావడం కాదు. అదొక పీడకల లాగ ఎప్పటికీ గుర్తుండి పోవాలనే ఉద్దేశ్యంతోనే అల్లు అర్జున్ మీద గానీ, సినిమా ఇండస్ట్రీ మీద గాని ఆయన అలాంటి మొండి వైఖరిని పాటిస్తున్నాడు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా?
దేనికి మీ పరామర్శలు.. సినీ ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న pic.twitter.com/NpMeLzGIbV
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2024