https://oktelugu.com/

బోల్డ్ డైరెక్టర్ కి సీనియర్ హీరోయిన్స్ దూరం !

బోల్డ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నానని రీసెంట్ గా ఘనంగా ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు. నిజానికి ఈ సినిమాని మొదలుపెట్టడానికి అజ‌య్ భూప‌తి రెండేళ్ళు పాటు నానాకష్టాలు పడ్డాడు. అయినా మనోడు ఎక్కడా తగ్గకుండా ముందుకుపోతూ వర్మ శిష్యుడు అనిపించుకున్నాడు. కానీ అజ‌య్ భూప‌తి సినిమాని సెట్ చేసుకున్నా… కరోనా మహమ్మారి భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ జరగకుండా కమ్మేసేసింది. ‘మహా సముద్రం’ సినిమా పక్కా యాక్షన్ డ్రామా. […]

Written By:
  • admin
  • , Updated On : September 16, 2020 / 03:41 PM IST
    Follow us on


    బోల్డ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నానని రీసెంట్ గా ఘనంగా ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు. నిజానికి ఈ సినిమాని మొదలుపెట్టడానికి అజ‌య్ భూప‌తి రెండేళ్ళు పాటు నానాకష్టాలు పడ్డాడు. అయినా మనోడు ఎక్కడా తగ్గకుండా ముందుకుపోతూ వర్మ శిష్యుడు అనిపించుకున్నాడు. కానీ అజ‌య్ భూప‌తి సినిమాని సెట్ చేసుకున్నా… కరోనా మహమ్మారి భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ జరగకుండా కమ్మేసేసింది. ‘మహా సముద్రం’ సినిమా పక్కా యాక్షన్ డ్రామా. ఈ కరోనా కాలంలో ఈ సినిమా చేయడం సాధ్యం కాదు. అందుకే అజ‌య్ భూప‌తి ఈ లోపు ఓ వెబ్ ఫిల్మ్ ను చేయడానికి సన్నధం అవుతున్నాడు.

    Also Read: శ్రావణి కేసు రిమాండ్ రిపోర్ట్: నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

    అయితే ఈ వెబ్ ఫిల్మ్ కుర్రోళ్ళను టార్గెట్ చేసుకుని చేస్తున్నాడట. కాన్సెప్ట్ బాగా బోల్డ్ గా ఉంది, ఆంటీల మీద కుర్రోళ్ళు ఎందుకు అంత ఇంట్రస్ట్ చూపిస్తారు. ఒకవేళ వాళ్లకు ఆవకాశం వస్తే ఎలాంటి తప్పులు చేస్తారు. ఆ తప్పులు కారణంగా చివరకు వాళ్ళు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటారు. అలాగే తప్పటడుగులు వేసిన ఆంటీల పరిస్థితి ఏమిటి.. వాళ్ళ భర్తలకు వీళ్ళ విషయం తెలిస్తే ఎలాంటి బాధలు ఉంటాయి అనే కోణంలో ఈ వెబ్ ఫిల్మ్ సాగుతుంది. అయితే ఈ వెబ్ సినిమాలో మెయిన్ లీడ్ గా సీనియర్ హీరోయిన్ రంభ నటించబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలిపోయింది.

    Also Read: బిగ్ బాస్4: గంగవ్వపై కుట్రలు చేస్తున్నారా..?

    ప్రస్తుతం అజయ్ ఈ వెబ్ ఫిల్మ్ లో మెయిన్ లీడ్ కోసం వెతుకున్నాడట. ఈ క్రమంలోనే అజ‌య్ ఇప్పటికే సీనియర్ హీరోయిన్ రాశికి కూడా కథ కూడా వివరించార‌ని.. రాశి ఇలాంటి వెబ్ ఫిల్మ్ చేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కానీ, మరో సీనియర్ హీరోయిన్ ప్రేమ ఈ వెబ్ ఫిల్మ్ చేయడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోన్నా.. అజయ్ సన్నిహితుల సమాచారం ప్రకారం అందులో కూడా నిజం లేదట. అజయ్, మీనాని కూడా అడిగాడని ఆమె కూడా నేను చేయలేనని స్పష్టం చేసిందని తెలుస్తోంది. రమ్యకృష్ణ పెట్టుకుందామంటే భారీ రెమ్యునిరేషన్ అడుగుతుంది. ఏమైనా బోల్డ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి కి సీనియర్ హీరోయిన్స్ అంతా నో చెబుతూ దూరం జతుగుతున్నారు.