https://oktelugu.com/

సుశాంత్ ది హత్యే.. సంచలన నిజాలు

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి వెనుక మిస్టరీ ఇప్పటికీ వీడడం లేదు. అతడిది హత్యనా? ఆత్మహత్యనా అన్న విషయంలో పోలీసులు ఇప్పటికీ తేల్చడం లేదు. సుశాంత్ చనిపోయాక అతడి ఇంట్లో ఆధారాలన్నీ మాయం చేశారనే ఆరోపణలున్నాయి. అందుకే  సుశాంత్‌ చనిపోయి మూడు నెలలు దాటినా కేసు అతీగతీ తేలడం లేదు. రోజుకో తీరుగా మలుపుతిరుగుతోంది. ముందుగా అతడిది ఆత్మహత్యగానే అందరూ భావించారు. కానీ.. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు హత్య అంటూ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2020 4:22 pm
    bjp mla nitish rane

    bjp mla nitish rane

    Follow us on

    bjp mla nitish raneబాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి వెనుక మిస్టరీ ఇప్పటికీ వీడడం లేదు. అతడిది హత్యనా? ఆత్మహత్యనా అన్న విషయంలో పోలీసులు ఇప్పటికీ తేల్చడం లేదు. సుశాంత్ చనిపోయాక అతడి ఇంట్లో ఆధారాలన్నీ మాయం చేశారనే ఆరోపణలున్నాయి. అందుకే  సుశాంత్‌ చనిపోయి మూడు నెలలు దాటినా కేసు అతీగతీ తేలడం లేదు. రోజుకో తీరుగా మలుపుతిరుగుతోంది. ముందుగా అతడిది ఆత్మహత్యగానే అందరూ భావించారు. కానీ.. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు హత్య అంటూ అనుమానించారు. బాలీవుడ్‌లోని ఒక వర్గం అతడిని ఒత్తిడిలోకి నెట్టిందని.. సుశాంత్‌ లవర్‌‌ రియా వల్లే అతను చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Also Read : నమో మోడీ.. వెన్నుచూపని భారతీయుడు

    తాజాగా.. మహారాష్ట్రకు చెందిన భాజపా ఎమ్మెల్యే నితీష్ రాణె రిపబ్లిక్ టీవీ చానెల్‌లో నిర్వహించిన చర్చలో సంచలన నిజాలు చెప్పుకొచ్చాడు. సుశాంత్, అతడి మేనేజర్ దిశల మృతికి సంబంధించి ఎవ్వరికీ తెలియని నిజాలను పంచుకున్నాడు.. సుశాంత్ , దిశలవి ఆత్మహత్యలు కావని, అవి హత్యలే అని, తన దగ్గర రుజువులు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం సుశాంత్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను కూడా కలిసి ఆ ఆధారాలు సమర్పిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

    జూన్ 8న సుశాంత్ మేనేజర్ దిశ ఆత్మహత్యకు పాల్పడిందని.. దాని కంటే ముందు ఆమె ఇష్టం లేకుండా ఒక పార్టీలో పాల్గొందని.. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైందని బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే తెలిపారు. దీని గురించి సుశాంత్‌కు దిశ ఫోన్ చేసిందని.. అతను రియాకు విషయం చెప్పాడని వెల్లడించాడు. రియా దిశను ఇబ్బంది పెట్టిన వ్యక్తులకు ఫోన్ చేసి అంతా వివరించడంతో దిశ తన ఫ్లాట్‌కు వచ్చేసరికి ఓ వ్యక్తి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడని.. అతనే దిశ మరణానికి కారణమని నితీష్ రాణె ఆరోపించాడు.

    దిశ చనిపోయిన రోజే రియా ఉన్న పళంగా సుశాంత్‌ ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. తర్వాత ఐదు రోజులకే సుశాంత్‌ కూడా మరణించాడని, అతడి మృతి వెనుక కూడా కొన్ని శక్తులు పని చేశాయని ఆరోపించాడు.

    Also Read : ఆశ్చర్యం.. మన ఎంపీలు జీతాల్లో కోత?