2015లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. నేరచరితులైన నేతలపై విచారణను వేగవంతం చేసి వారికి శిక్ష పడేలా చేయాలని.. కానీ 2020 అయినా అది అమలు కాలేదు. దీంతో సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేంద్రం ఒప్పుకుంది.
Also Read: దుర్గమ్మ రథంలో వెండి సింహాలు మాయం చేసిందెవరు?
ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు సత్వరమే విచారించేలా కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రతినిధులపై నమోదయ్యే కేసులను వేగంగా విచారించేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ కు కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీం కోర్టు ధర్మాసనానికి నివేదించింది. ఈ పరిణామం తీవ్ర అభియోగాలున్న ఏపీ సీఎం జగన్, శశికళ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సహా ఎంతో మంది నేతల మెడకు గుదిబండగా మారనుంది. వారి కేసులు త్వరగా పూర్తి అయ్యి జైలు పాలు అయ్యే అవకాశాలుంటాయి. ఇదే జరిగితే వారి రాజకీయ భవిష్యత్తు కూడా గందరగోళంలో పడనుంది.
2015లో సుప్రీం కోర్టు ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల తర్వాత అంటే 2020 నాటికి కూడా అమలు కాకపోవడంపై దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారిస్తోంది.
నేతలపై కేసుల సత్వర విచారణ కోసం కాలవ్యవధిని నిర్ణయించవచ్చని.. ఈ విషయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం తీసుకునే ఏ నిర్ణయానికైనా కేంద్రం సానుకూలంగా ఉందని తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.
Also Read: సోము వీర్రాజు వ్యూహం.. కన్నా పూర్తిగా సైడ్ అయినట్లేనా?
ఈ విచారణలో భాగంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. సెప్టెంబర్ తొలివారంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై స్పందించిన కేంద్రం ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంలో సుప్రీం కోర్టు త్వరలోనే కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.
ఈ తీర్పు వస్తే చాలా మంది నేతల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడుతుంది. ఏపీ సీఎం జగన్ సహా చాలా మంది కటకటాల పాలయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఇన్నాళ్లు ఇది జాప్యం జరిగింది. ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో నేతల భవిష్యత్ డోలాయమానంలో పడనుంది.